Bhutan Imposes Coronavirus Lockdown: కరోనా వైరస్ దెబ్బకు చిన్న దేశమైన భూటాన్ తొలిసారిగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించింది. కువైట్ నుంచి భూటాన్‌కు తిరిగొచ్చిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో అధికారులు అక్కడ తొలిసారిగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించారు. ఐదు నుంచి 21 రోజుల వరకు ఉండే ఈ లాక్‌డౌన్‌లో ప్రజలు అందరూ కూడా స్వీయ నిర్భందంలోనే ఉండాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం భూటాన్‌లో 113 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా.. ఒక మరణం కూడా సంభవించలేదు. అందుకే వైరస్ వ్యాప్తిని ముందుగానే కట్టడి చేయడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. సుమారు 7.5 లక్షల జనాభా ఉన్న ఆ చిన్న దేశం.. ఖచ్చితమైన స్క్రీనింగ్, టెస్టింగ్ లాంటి చర్యలు చేపట్టడం ద్వారా కోవిడ్ వ్యాప్తిని సమర్ధవంతంగా అడ్డుకోగలిగింది.
Also Read:
తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.
గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల తేదీలు ఖరారు.!
ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..