IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డికి స్థానం

|

Sep 28, 2024 | 10:55 PM

ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్నాయి. తాజాగా ఈ సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ టీమ్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు

IND vs BAN: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్ రెడ్డికి స్థానం
Team India
Follow us on

ప్రస్తుతం స్వదేశంలో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది భారత జట్టు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన రెండో టెస్టు ఇప్పుడు కాన్పూర్ వేదికగా జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్ తర్వాత ఇరు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనున్నాయి. తాజాగా ఈ సిరీస్‌కు బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ టీమ్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహించనున్నాడు. ఇందులో విశేషమేమిటంటే.. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి భారత జట్టులో స్థానం దక్కడం. అలాగే పేస్ గన్ మయాంక్ యాదవ్ ను కూడా జట్టులోకి తీసుకున్నారు. అయితే అద్భుత ప్రదర్శన చేసినా కొందరు ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఇద్దరూ తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యారు. అలాగే లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సుమారు మూడేళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అతను తన చివరి T20I మ్యాచ్ 2021 ప్రపంచకప్‌లో ఆడాడు. రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు మళ్లీ నిరాశే ఎదురైంది. మరీ ముఖ్యంగా రుతురాజ్‌కి అవకాశం ఇవ్వకపోవడంపై క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్‌లకు కూడా విశ్రాంతి కల్పించారు. ఈ ఆటగాళ్లు ప్రస్తుతం బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడుతున్నారు.

ఇవి కూడా చదవండి

 

బంగ్లాదేశ్ తో T20 సిరీస్ షెడ్యూల్

  • మొదటి మ్యాచ్, అక్టోబర్ 6, గ్వాలియర్
  • రెండవ మ్యాచ్, అక్టోబర్ 9, న్యూఢిల్లీ
  • మూడో మ్యాచ్, అక్టోబర్ 12, హైదరాబాద్

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు టీం ఇండియా:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, ర్యాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..