Mermaid Baby : తెలంగాణలో బుధవారం రాత్రి ఓ వింత శిశువు జన్మించింది. ఈ పసిపాప మత్సకన్యలా ఉంది.. తల మనిషిని పోలి.. మిగిలిన శరీరం చేపలా ఉంది. అయితే ఈ శిశివు అరుదైన మెర్మైడ్ సిండ్రోమ్ అనే వ్యాధితో పుట్టింది. అయితే పుట్టిన రెండు గంటల్లోనే ఈ వింతశిశివు మరణించింది. ఈ ఘటన హైదరాబాద్ లోని పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ గర్భిణీ నెలలు నిండడంతో డెలివరీ కోసం పాతబస్తీలోని ప్లేట బురుజు ఆస్పత్రికి వచ్చింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ఆ మహిళ ఓ బిడ్డను ప్రసవించింది. అయితే ఆ శిశువును చూసి వైద్యులు షాక్ తిన్నారు. పుట్టిన బిడ్డ చేతి వేళ్ళు, సక్రమంగా అభివృద్ధి చెందలేదు.. ఇక రెండు కాళ్ళు కలిసి పోయి చేప ఆకారాన్ని తలపించాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. పుట్టిన కొద్దీ సేపటికే మరణించింది. ఇలా శిశువు పుట్టడానికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి వైద్యులు పరీక్షల నిమిత్తం మాయ ను పంపించామని వైద్య సిబ్బంది చెప్పారు. ఇప్పటి వరకూ ఇటువంటి లోపాలను కలిగిన పిల్లలు తమ ఆస్పత్రిలో పుట్టలేదని.. ఇదే మొదటి కేసని చెప్పారు. ప్రస్తుతం తల్లి ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు.
Also Read: