Steve Smith Record: స్లెడ్జింగ్‌కు మారుపేరు అయిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్.. ఆ చర్యకు బాగా హార్ట్ అయినట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్.. స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ ఆటతీరుపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఉన్న స్ట్రైక్ రేట్‌ను వన్డేల్లో స్టీవ్ స్మిత్ మెయింటైన్ చేస్తున్నాడని.. అలాగే ఐపీఎల్‌లో మాక్స్‌వెల్ ఖరీదైన చీర్ లీడర్ అంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. వాటికి సరైన సమాధానం చెబుతూ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ మొదటి రెండు వన్డేల్లోనూ రెచ్చిపోయారు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఐపీఎల్‌లో ఆడిన మొత్తం మ్యాచ్‌ల్లో 108 పరుగులు చేసిన మ్యాక్సీ.. ఇక్కడ రెండు మ్యాచ్‌ల్లోనే ఆ కోటాను పూర్తి చేశాడు. ఆసీస్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
ఇక స్టీవ్ స్మిత్ విషయానికి వస్తే.. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని మరోసారి చాటి చెబుతూ రెండు సెంచరీలు బాదేశాడు. అంతేకాకుండా టీమిండియాపై అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో భారత్‌పై 5 అంతకంటే ఎక్కువ సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా ఘనత అందుకున్నాడు. ఈ జాబితాలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ 6 శతకాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే పాంటింగ్‌కు ఆరు సెంచరీలు సాధించడానికి 59 మ్యాచ్‌లు పట్టగా.. స్టీవ్ స్మిత్ కేవలం 20 వన్డేల్లోనే ఈ ఫీట్(5 సెంచరీలు) అందుకున్నాడు.