పేస్ట్ కోసం వస్తే పోస్ట్ పోయింది..
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ లాక్‌డౌన్ క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఓ ఫుట్‌బాల్ కోచ్‌పై వేటు పడింది. కోవిడ్ 19తో ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ప్రపంచ దేశాలు తమ లాక్‌డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తూనే ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ కూడా కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. జర్మనీలో బుండెస్లిగా ఫుట్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆటగాళ్లంతా క్వారంటైన్ నిబంధనల్ని పాటిస్తున్నారు. కాగా, ఆగ్స్‌బర్గ్ జట్టుకు చెందిన కోచ్ హీకో హెర్లిచ్ […]

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్ లాక్‌డౌన్ క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఓ ఫుట్‌బాల్ కోచ్‌పై వేటు పడింది. కోవిడ్ 19తో ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న ప్రపంచ దేశాలు తమ లాక్‌డౌన్ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తూనే ఆంక్షలతో కూడిన సడలింపులు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా జర్మనీ కూడా కొన్నింటికి మినహాయింపు ఇచ్చింది. జర్మనీలో బుండెస్లిగా ఫుట్‌బాల్ లీగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆటగాళ్లంతా క్వారంటైన్ నిబంధనల్ని పాటిస్తున్నారు. కాగా, ఆగ్స్‌బర్గ్ జట్టుకు చెందిన కోచ్ హీకో హెర్లిచ్ మాత్రం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించాడు. టీమ్ బస చేసిన హోటల్‌లో ఉండకుండా బయటకొచ్చాడు. టూత్ పేస్ట్ అయిపోయిందంటూ సూపర్ మార్కెట్‌కెళ్లి మరీ కొనుక్కొచ్చాడు. దీనిపై బుండెస్లిగా యాజమాన్యం సీరియస్ గా తీసుకుంది. లీగ్ పునః ప్రారంభపు మ్యాచ్‌కు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జర్మన్ ఫుట్‌బాల్ లీగ్ టాస్క్‌ఫోర్స్ రూల్స్‌ను హెర్లిచ్ బ్రేక్ చేసిన కారణంగా అతను కనీసం ప్రాక్టీస్ సెషన్‌కు కూడా రాకుండా వేటువేసింది. దీనిపై స్పందించిన హెర్లిచ్.. ఇప్పటివరకూ రూల్స్ పాటిస్తూ వచ్చానని.. హోటల్ నుంచి బయటకొచ్చి తప్పు చేశానన్నారు. టూత్ పేస్ట్ లేకపోవడం వల్ల బయటకు రావాల్సి వచ్చిందన్నారు. కరోనా టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన తర్వాత జట్టుతో కలుస్తానన్నారు హెర్లిచ్. కరోనా సంక్షోభం తర్వాత తిరిగి ప్రారంభం అవుతున్న యూరప్ తొలి మేజర్ లీగ్ ఇదే. శనివారం ఆరంభమయ్యే ఈ ఫుట్‌బాల్ లీగ్‌లో ఆగ్స్‌బర్గ్-వుల్ఫ్స్ బర్గ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది.




