మొరాయించిన సర్వర్‌లు…రిజ‌ల్ట్స్ కోసం ఇంట‌ర్ స్టూడెంట్స్ నిరీక్షణ

ఏపీ‌ ఇంటర్మీడియట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్సర ప‌రీక్షా‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజ‌య‌వాడ‌లో రిలీజ్ చేశారు. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ప్రభుత్వం ఈసారి రిజ‌ల్ట్స్ ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది. అయితే ఎంతో ఉత్కంఠ‌తో మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు వెయిటింగ్ తప్పడం లేదు

మొరాయించిన సర్వర్‌లు...రిజ‌ల్ట్స్ కోసం ఇంట‌ర్ స్టూడెంట్స్ నిరీక్షణ
Follow us

|

Updated on: Jun 12, 2020 | 7:41 PM

ఏపీ‌ ఇంటర్మీడియట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్సర ప‌రీక్షా‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విజ‌య‌వాడ‌లో రిలీజ్ చేశారు. కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ప్రభుత్వం ఈసారి రిజ‌ల్ట్స్ ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది. అయితే ఎంతో ఉత్కంఠ‌తో మార్కులను చూసుకుందామని ప్రయత్నించిన విద్యార్థులకు వెయిటింగ్ తప్పడం లేదు. సాయంత్రం 4గంటలకు రిజ‌ల్ట్స్ రిలీజ్ చేయగా… గంటలు గడుస్తున్నా ఫలితాలు అందుబాటులోకి రావట్లేదు.

టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ కారణంగా రిజ‌ల్ట్స్ రావ‌డం లేదు. ఒకేసారి ఫ‌స్ట్, సెకండ్ ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయడం, అదీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయడంతో..విద్యార్థులు భారీ సంఖ్య‌లో ఫ‌లితాలు చెక్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో సర్వర్‌లు స‌రిగ్గా ప‌నిచేయ‌డం లేదు. రిజ‌ల్ట్స్ కోసం వెతుకుతుంటే..సేవలు అందుబాటులో లేవని సందేశం వస్తుంది. అయితే కొంత‌సేప‌టి త‌రువాత తిరిగి ఫ‌లితాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. కాగా లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఎగ్జామ్ రిజ‌ల్ట్స్ వెల్లడించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం విశేషం.