సీఎం నెల్లూరు టూర్‌లో మార్పులు, 9వ తేదీకి బదులుగా 11న పర్యటన, భారీ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

ఈ నెల 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు ఖరారు కావడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం భారీ..

సీఎం నెల్లూరు టూర్‌లో మార్పులు, 9వ తేదీకి బదులుగా 11న పర్యటన, భారీ బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు

Updated on: Jan 05, 2021 | 7:12 AM

ఈ నెల 11న సీఎం జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనకు ఖరారు కావడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం భారీ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు అనిల్ కుమార్, అదిమూలపు సురేష్ పరిశీలించారు. ఈనెల 11 న అమ్మఒడి రెండవ విడతను నెల్లూరులో ప్రారంభించనున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా నగరంలోని మినీ బై పాస్ దగ్గర వేణుగోపాలస్వామి గ్రౌండ్ లో ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తారు.

ఇందుకోసం ఏపీ మంత్రులు సభ ఏర్పాట్లతో పాటు, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. మంత్రుల వెంట సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలసిల రఘురాం, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు. ఇలా ఉండగా, సీఎం నెల్లూరు పర్యటన ముందుగా 9 వ తేదీ అనుకున్నప్పటికీ కొన్ని కారణాలరిత్యా 11కి వాయిదా వేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us