Sourav Ganguly health latest update : దాదాకు పూర్తయిన యాంజియోప్లాస్టీ..డాక్టర్లు ఏం చెప్పారంటే..?

ఛాతినొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి యాంజియోప్లాస్టీ చేశారు వైద్యులు.

Sourav Ganguly health latest update : దాదాకు పూర్తయిన యాంజియోప్లాస్టీ..డాక్టర్లు ఏం చెప్పారంటే..?

Updated on: Jan 02, 2021 | 5:05 PM

ఛాతినొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్‌ ఆసుపత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(48)కి యాంజియోప్లాస్టీ చేశారు వైద్యులు. ఒక వాలు 90% బ్లాక్ అవ్వగా..మరో రెండు స్వల్పంగా బ్లాక్ అయినట్లు గుర్తించి..సరిచేశారు. యాంజియోప్లాస్టీ ముగిసిన అనంతరం ఆయన్ను జనరల్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. 

శుక్రవారం సాయంత్రం గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడ్డారు గంగూలీ. శనివారం మధ్యాహ్నం కూడా ఛాతి నొప్పి ఇబ్బంది పెట్టడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు దాదాకు యాంజియోప్లాస్టీ చేశారు. విషయం తెలుసుకున్న గంగూలీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం దాదా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ ట్వీట్లు వేస్తున్నారు.

Also Read : Leaders Visit To Ramatheertham : రాజకీయ రణరంగమైన రామతీర్థం..నేతల పర్యటనలతో పెరగిన హీట్