బిగ్ బి న్యూస్: అమితాబ్‌కు అముల్ స్పెషల్ గిఫ్ట్..

|

Aug 06, 2020 | 3:39 PM

'అముల్ పాప' అమితాబ్ బచ్చన్‌కు అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చింది. కొవిడ్ నుంచి కోలుకున్న సందర్భంగా ఓ స్పెషల్ కార్టున్‌ను విడుదల చేసింది. పాలు, పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ దేశీయంగా అగ్రస్థానంలో...

బిగ్ బి న్యూస్: అమితాబ్‌కు అముల్ స్పెషల్ గిఫ్ట్..
Follow us on

‘అముల్ పాప’ అమితాబ్ బచ్చన్‌కు అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చింది. కొవిడ్ నుంచి కోలుకున్న సందర్భంగా ఓ స్పెషల్ కార్టున్‌ను విడుదల చేసింది. పాలు, పాల ఉత్పత్తుల సంస్థ అమూల్‌ దేశీయంగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. అప్పుడప్పుడు సమాజంలో జరుగుతున్న పరిణామాలను ప్రతిబింబించేలా తమ ‘అమూల్‌ బ్రాండ్‌ గర్ల్‌’ బొమ్మతో కార్టూన్లను రూపొందిస్తుంటుంది. వీరు విడుదల చేసే కార్టున్స్ ఎంతో ఆసక్తికరంగా.. ఆలోచించేలా ఉంటాయి. తాజాగా కరోనా నుంచి కోలుకున్న బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ కోసం ఓ ప్రత్యేక కార్టూన్ రూపొందించింది. ప్రస్తుతం ఈ కార్టూన్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారింది.

గత నెలలో అమితాబ్‌, ఆయన కుటుంబం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో వారంతా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజులపాటు చికిత్స తీసుకున్న వారి కుటుంబంలో ముందుగా అమితాబ్‌ కోడలు ఐశ్వర్యారాయ్‌ బచ్చన్, మనవరాలు ఆరాధ్య బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. అయితే మూడ్రోజుల క్రితం అమితాబ్‌ బచ్చన్‌ కూడా కోలుకొని డిశ్చార్జి అయి ఇంటికి వచ్చారు. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చిన ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

ఈ నేపథ్యంలో అమూల్‌ సంస్థ కూడా అమితాబ్‌ బచ్చన్‌కు అభినందనలు తెలుపుతూ ఓ ప్రత్యేక కార్టూన్‌ను రూపొందించింది. కూర్చిలో అమితాబ్‌ కూర్చొని ఒక చేతిలో మొబైల్‌ ఫోన్‌, మరో చేతి బొటన వేలితో వెన్న పట్టుకొని ఉన్నట్లు.. అమూల్‌ పాప ఆయన భూజాలపై వాలి మొబైల్‌ను చూస్తున్నట్లుగా కార్టూన్‌ ఉంది. దీనిపై ‘ఏబీ బీట్స్‌ సీ’ (AB beats C!)..అమితాబ్‌ బచ్చన్‌ కరోనాను ఓడించారు అనే అర్థం వచ్చేలా రాశారు. ఈ అమూల్‌ కార్టూన్‌ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అమూల్‌ రూపొందించిన కార్టూన్‌పై బిగ్ బి‌ స్పందించారు. ‘‘మీ ప్రత్యేకమైన పోస్టర్‌ ప్రచారంలో నా గురించి ఆలోచించినందుకు ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా అమూల్‌ నన్ను సత్కరిస్తోంది. ఓ సాధారణ వ్యక్తిని అమూల్యంగా మార్చింది’’ అని అమితాబ్‌ ఆ కార్టూన్‌ను తన ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు.