Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ నుంచి అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ ఔట్.. తీవ్ర ఒత్తిడితోనే అంటూ.. !

రియో ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలతోపాటు అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో దిగ్గజ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అమెరికా యువ తార సిమోన్‌ బైల్స్‌. తాజాగా భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన సిమోన్ బైల్స్.. అనూహ్యంగా అభిమానులకు షాకిస్తూ.. ఒలింపిక్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ నుంచి అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ ఔట్.. తీవ్ర ఒత్తిడితోనే అంటూ.. !
Simon Byles
Follow us

|

Updated on: Jul 29, 2021 | 2:44 PM

Tokyo Olympics 2020: రియో ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలతోపాటు అంతర్జాతీయ వేదికపై 36 పతకాలతో జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో దిగ్గజ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అమెరికా యువ తార సిమోన్‌ బైల్స్‌. తాజాగా భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్ బరిలో నిలిచిన సిమోన్ బైల్స్.. అనూహ్యంగా అభిమానులకు షాకిస్తూ.. ఒలింపిక్స్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మంగళవారం జరిగన మ్యాచు నుంచి మధ్యలోనే తప్పుకున్న బైల్స్.. గురువారం జరిగే ఆల్ ఆరౌండ్ ఈవెంట్‌లో కూడా పాల్గొనడం లేదని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో వచ్చేవారం జరగబోయే వ్యక్తిగత ఈవెంట్లలో ఆమె పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. తాను మానసికంగా సిద్ధంగా లేనని, అందుకే టోక్యో ఒలింపిక్స్ నుంచి అర్థాంగతరంగా తప్పుకోవాల్సి వచ్చిందని బైల్స్ మీడియాతో పేర్కొంది.

ఒకవైపు బ్రాండ్‌ పేరు, మరోవైపు స్పాన్సర్లు, ఇంకోవైపు అభిమానులు.. ఇలా ప్రతీ అంశం 24ఏళ్ల బైల్స్‌ను మానసికంగా భయపెడుతోందని చెప్పవచ్చు. సాధారణంగా ప్రతీ టోర్నీ ముందు దిగ్గజ ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉండడం సహజమే. కానీ, వాటిని అందుకోవడంలో ఆటగాళ్లు విఫలమైతే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటారు. దీంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న బైల్స్.. టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం గమనార్హం. ‘రియో’ ఒలింపిక్స్ తరువాత బైల్స్ చాలాసార్లు మానసికంగా ఆందోళనకు గురైంది. కిడ్నీలో రాయితో ఓవైపు ఇబ్బంది పెడుతున్నా.. కేవలం స్పాన్సరు, అభిమానుల కోసం ఆమె 2018 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగింది. అయితే ఒలింపిక్స్‌ ట్రయల్స్‌ సందర్భంగా బైల్స్ బాగా వెనుకబడిందనే వార్తలు వెలువడ్డాయి. గత ఎనిమిదేళ్లలో ఆమె వెనుకంజలో ఉండడం జరగలేదు.

అయితే తాజాగా టోక్యోలో మంగళవారం ‘వాల్ట్‌’ విన్యాసంలో పాల్గొంది. కానీ, అందులో పాల్గొన్న ఆమెలో ఆనాటి ఉత్సాహం కరవైంది. 2 1/2 ట్విస్ట్‌లు చేయాల్సిన ఆమె.. 1 1/2 ట్విస్ట్‌కే పరిమితమైంది. అయితే గట్టిగా ప్రయత్నిస్తే.. తరువాత ఏదైనా ఇబ్బందులు వస్తాయోమోనని ఇబ్బంది పడింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురయిన బైల్స్… టోర్నీ నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ప్రస్తుత పరిస్థితుల్లో నా మానసిన సమస్యలను పరిష్కరించుకోవాలి. ఆ విషయాలు బయటకు చెప్పలేను. నాకు ఎలాంటి గాయం లేదు. మానసికంగా కొంత ఇబ్బంది ఉంది. ఇలాంటి సందర్భంలో లేని గాయాలు కొని తెచ్చుకోలేను. ఒలింపిక్స్‌లో నా కోసం కాకుండా వేరెవరి కోసమో ఆడుతున్నట్లు అనిపిస్తోంది. ఈ విషయంలో చాలా బాధపడ్డాను’ అని పేర్కొంది.

Also Read:

Tokyo Olympics 2020: బీచ్ వాలీబాల్‌లో బికినీ ధరించం.. ఈ సంప్రదాయంపై మహిళా అథ్లెట్లు సీరియస్..!

IND vs SL: “సెలవుల్లా ఫీలవుతారని జట్టులో ఎంపిక చేయలేదు.. అవకాశం వచ్చినప్పుడే సత్తా చాటాలి”

Latest Articles
హనుమకొండలో స్కూల్‌ బస్‌ రోడ్డుపై బోల్తా.. వీడియో వైరల్
హనుమకొండలో స్కూల్‌ బస్‌ రోడ్డుపై బోల్తా.. వీడియో వైరల్
ఆశా భోస్లే కాళ్లు కడిగిన స్టార్ సింగర్ సోనూ నిగమ్
ఆశా భోస్లే కాళ్లు కడిగిన స్టార్ సింగర్ సోనూ నిగమ్
శాంసంగ్‌ నుంచి సరికొత్త హోమ్‌ థియేటర్‌.. డాల్బీ అట్మాస్‌తో..
శాంసంగ్‌ నుంచి సరికొత్త హోమ్‌ థియేటర్‌.. డాల్బీ అట్మాస్‌తో..
కలెక్షన్ల ఊచకోత.. ట్రిపుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి
కలెక్షన్ల ఊచకోత.. ట్రిపుల్ ఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన కల్కి
ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీకు రూ. 10 లక్షల బీమా ఉన్నట్లే
ఏటీఎమ్‌ కార్డు ఉందా.? అయితే మీకు రూ. 10 లక్షల బీమా ఉన్నట్లే
షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు
షాద్‌నగర్‌లో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. ముక్కముక్కలైన మృతదేహాలు
ఆ నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ.. పార్టీ మారనున్న వైసీపీ నేతలు..?
ఆ నియోజకవర్గంపై కన్నేసిన టీడీపీ.. పార్టీ మారనున్న వైసీపీ నేతలు..?
పాలసీ ఏదైనా.. జనాలకు కావాలి క్యాష్‌లెస్‌.. కారణమేమిటంటే..
పాలసీ ఏదైనా.. జనాలకు కావాలి క్యాష్‌లెస్‌.. కారణమేమిటంటే..
ఫ్యాన్స్ ముద్దుగా ఈమెను జూనియర్ ఆర్తి అగర్వాల్ అంటుంటారు..
ఫ్యాన్స్ ముద్దుగా ఈమెను జూనియర్ ఆర్తి అగర్వాల్ అంటుంటారు..
ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం..కుటుంబాన్ని కాపాడిన కొడుకు
ప్రమాదంలో ఫలించిన పసిబాలుడి ప్రయత్నం..కుటుంబాన్ని కాపాడిన కొడుకు