28 June 2024

క్యాన్సర్ బారిన పడిన బుల్లితెర నటి.. మూడో స్టేజ్ అంటూ పోస్ట్..

Rajitha Chanti

Pic credit - Instagram

బాలీవుడ్ బుల్లితెర నటి హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడింది. ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది హీనా ఖాన్.

ప్రస్తుతం తాను మూడో దశ రొమ్ము క్యాన్సర్‏తో బాధపడుతున్నాని బయటపెట్టింది. అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 

త్వరలోనే కోలుకుని తిరిగి మాములు మనిషి అవుతానని ధీమా వ్యక్తం చేస్తూ తన ఇన్ స్టా ఖాతాలో సుధీర్ఘ నోట్ షేర్ చేసింది హీనా ఖాన్. 

ప్రస్తుతం హీనా ఖాన్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‏గా మారగా.. ధైర్యంగా ఉండాలని ధైర్యం చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

2009లో హే రిస్తా క్యా ఖేల్తా హై సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది హీనా ఖాన్. ఈ సీరియల్‍తో పాపులర్ అయ్యింది హీనా ఖాన్. 

ఈ సీరియల్ తర్వాత ఫియర్ ఖత్రోంకి ఖిలాడీ 8, బిగ్‏బాస్ సీజన్ 11 రియాల్టీ షోలలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది హీనా ఖాన్.

ఆ తర్వాత నాగిన్ 5, షద్యంత్రా సీరియల్స్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. పలు సీరియల్స్ లో అతిథి పాత్రలు చేసింది. 

అలాగే అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ చేసింది. ప్రొడ్యూసర్ రాకీ జైశ్వాల్‍ను ప్రేమించి 2014లో పెళ్లి చేసుకుంది హీనా ఖాన్.