బన్నీ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’.. సుక్కు మాస్టర్ ప్లాన్ ఇదేనా!

‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు తెరకెక్కాయి. ఈ కొత్త సినిమా బన్నీ- సుక్కు కాంబోలో వచ్చే మూడో సినిమా. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్  మీడియాలో హల్‌చల్ చేస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కనుందని […]

బన్నీ సినిమాలో 'మక్కల్ సెల్వన్'.. సుక్కు మాస్టర్ ప్లాన్ ఇదేనా!
Follow us

|

Updated on: Oct 30, 2019 | 1:32 AM

‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న దర్శకుడు సుకుమార్ తన తదుపరి చిత్రం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య’, ‘ఆర్య 2’ చిత్రాలు తెరకెక్కాయి. ఈ కొత్త సినిమా బన్నీ- సుక్కు కాంబోలో వచ్చే మూడో సినిమా. ఇక ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్  మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించనుంది. ఇదంతా ఒక ఎత్తయితే.. లేటెస్ట్‌గా వచ్చిన న్యూస్ మరో ఎత్తు.. ఈ చిత్రంలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా కోసం విలన్‌ అవతారమెత్తిన విలక్షణ నటుడు.. సుక్కు- బన్నీ సినిమాలో విలన్ రోల్ కోసం సంప్రదింపులు జరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సుక్కు నేరేట్ చేసిన కాన్సెప్ట్ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ టాక్.

ఇక విజయ్ సేతుపతి ఈ రోల్‌ను అంగీకరిస్తే మాత్రం.. బన్నీ- సుక్కు సినిమాకి తమిళనాట భారీ గిరాకీ దక్కుతుందనే చెప్పాలి. ఎర్ర చందనం స్మగ్లింగ్ అంతా తమిళనాడు బోర్డర్ లోనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి విజయ్ సేతుపతిని విలన్ గా ఎంత ఖర్చు పెట్టి అయినా తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఇకపోతే ఈ సినిమా లాంచింగ్ ఇవాళ ఉదయం 9.36 నిమిషాలకు జరగనుంది

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. డిసెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.