
బాక్సింగ్ లో సూపర్ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ పోరాటాల సమయంలో తన క్రూరమైన దూకుడుతో క్రీడాభిమానులను విస్మయానికి గురిచేసేవాడు. టైసన్ నాకౌట్ (మొదటి రౌండ్లో 12) తో తన మొదటి 19 మ్యాచులు గెలుచుకున్నాడు. 1986 లో 20 ఏళ్ల వయసులోనే ట్రివర్ బెర్బిక్‌ను ఓడించి హెవీ వెయిట్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. బాక్సింగ్ చరిత్రలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న టైసన్ 2005లో రిటైర్ అయ్యాడు.
54 సంవత్సరాల వయస్సులో, మైక్ టైసన్ బాక్సింగ్ రింగులోకి తిరిగి రావాలని నిర్ణయం తీసుకున్నాడు. సెప్టెంబర్ 12న డిగ్నిటీ హెల్త్ స్పోర్ట్స్ పార్క్‌లో జరిగే ఎనిమిది రౌండ్ల ప్రదర్శన మ్యాచ్‌లో 4 డివిజన్ వరల్డ్ ఛాంపియన్ రాయ్‌జోన్స్ జూనియర్‌తో తలపడనున్నాడు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఒక మ్యూజిక్ ప్లాట్‌ఫాం ద్వారా టైసన్ పంచుకున్నాడు. తాను తిరిగి వస్తున్న సందర్భంగా చేసిన ఒక వీడియోను టైసన్ షేర్ చేశారు.
Also Read: హైదరాబాద్‌కు మరో ఘనత.. దేశంలోనే మొదటి స్థానం..
[svt-event date=”24/07/2020,12:53PM” class=”svt-cd-green” ]
[/svt-event]