14 ఏళ్ల బాలిక మృతదేహాన్ని బయటికి తీసి అత్యాచారయత్నం..

|

May 22, 2020 | 4:40 PM

అస్సాంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికితీసి అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 17న ఆ 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక అదే రోజు రాత్రి ఆమె కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సిమెన్ నది సమీపంలో ఖననం చేశారు. అంత్యక్రియలకు పలువురు గ్రామస్తులు హాజరయ్యారు. అయితే […]

14 ఏళ్ల బాలిక మృతదేహాన్ని బయటికి తీసి అత్యాచారయత్నం..
Follow us on

అస్సాంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన 14 ఏళ్ల బాలిక శవాన్ని వెలికితీసి అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 17న ఆ 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక అదే రోజు రాత్రి ఆమె కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సిమెన్ నది సమీపంలో ఖననం చేశారు. అంత్యక్రియలకు పలువురు గ్రామస్తులు హాజరయ్యారు.

అయితే మర్నాడు మే 18 మధ్యాహ్నం అటుగా వెళ్తున్న కొంతమంది మత్స్యకారులు.. 51 ఏళ్ల అకాన్ సైకియా అనే వ్యక్తి బాలిక మృతదేహాన్ని బయటికి తీసి అత్యాచారయత్నానికి పాల్పడడం చూశారు. వెంటనే సమాచారం పోలీసులకు అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకొని అకాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందుతుడు మానసిక రోగి కాదని.. సైకోపాత్ అని దేమాజీ ఎస్పీ ధనంజయ్‌ గానావత్ వెల్లడించారు. అతని మీద ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ 306,377 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

కాగా, నిందితుడు అకాన్ గురించి పలు నిజాలు బయటపడ్డాడు. ఇదివరకే రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలిసింది. 2018లో అతనిపై మొదటి భార్య గృహ హింస చట్టం కింద కేసు పెట్టడంతో అకాన్ దేమాజీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే కరోనా వ్యాప్తి కారణంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం కొంతమంది ఖైదీలను జైలు నుంచి పెరోల్ మీద రిలీజ్ చేశారు. అందులో అకాన్ కూడా ఉన్నాడు. కాగా, కొందరు  గ్రామస్తులు అతడు లైంగిక వేధింపులకు గురి చేయడం వల్లే ఆ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుని ఉంటుందని చెప్పినట్లు గానావత్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం బాలిక మృతదేహాన్ని పోలీసులు పంపించారు.

Read This: కిమ్ గురించి మరో షాకింగ్ నిజం.. నార్త్ కొరియాలో కలకలం..