ముంబై జలమయం.. గోడకూలి 16 మంది మృతి

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాద్ కాలనీలో గోడకూలి 13 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎంసీ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఇక 2 రోజుల వ్యవధిలో […]

ముంబై జలమయం.. గోడకూలి 16 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 12:31 PM

ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షం కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. మలాడ్ ఈస్ట్ ప్రాంతంలోని పింప్రిపాద్ కాలనీలో గోడకూలి 13 మంది మృతి చెందగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బీఎంసీ సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు.

ఇక 2 రోజుల వ్యవధిలో 540 మి.మి వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులన్నీ సంద్రాన్ని తలపిస్తున్నాయి. వర్షం దెబ్బకు రైళ్లు, విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాగల 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల విద్యుత్ లేక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు.

ముంబై నుంచి నడిచే రైళ్లు, ముంబైకి చేరుకునే రైళ్ల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు వెస్టన్ రైల్వే ప్రకటించింది. ముంబైకి వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు, కొన్ని సర్వీసులను అహ్మదాబాద్‌కు మళ్లిస్తున్నట్లు ఇండిగో విమాన సంస్థ అధికారికంగా తెలిపింది. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ముంబయి వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆశీష్ షెలార్ తెలిపారు.

Latest Articles