ఆ ఐటీ అవినీతి అధికారుల చిట్టా ఇదిగో…

ఐటీ, ఆర్థికశాఖల్లో కొందరు అవినీతి జలగలు, కీచకుల చిట్టా బయటపడింది. వీరి నిర్బంధ రిటైర్మెంట్ కు ప్రభుత్వం ఆదేశించింది. బలవంతపు వసూళ్లు, అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వీరిపై ఈమేరకు కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర స్థాయిలో ఇలాంటి అధికారులపై మోదీ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఐటీ జాయింట్ కమిషనర్ అశోక్ అగర్వాల్, ఈడీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ, నోయిడా లో ఈడీ విభాగం కమిషనర్ […]

ఆ ఐటీ అవినీతి అధికారుల చిట్టా ఇదిగో...
Follow us

|

Updated on: Jun 11, 2019 | 11:28 AM

ఐటీ, ఆర్థికశాఖల్లో కొందరు అవినీతి జలగలు, కీచకుల చిట్టా బయటపడింది. వీరి నిర్బంధ రిటైర్మెంట్ కు ప్రభుత్వం ఆదేశించింది. బలవంతపు వసూళ్లు, అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వీరిపై ఈమేరకు కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర స్థాయిలో ఇలాంటి అధికారులపై మోదీ ప్రభుత్వం ఈ విధమైన చర్యలు తీసుకోవడం ఇదే మొదటిసారి. ఐటీ జాయింట్ కమిషనర్ అశోక్ అగర్వాల్, ఈడీ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కె.శ్రీవాస్తవ, నోయిడా లో ఈడీ విభాగం కమిషనర్ హోమీ రాజ్ వంశ్ , ఇంకా మరికొంతమంది అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. ఆర్ధిక శాఖలో పని చేస్తున్న 8 మందిపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపింది. వీరిలో చీఫ్ కమిషనర్లు, ప్రిన్సిపల్ కమిషనర్లు, కమిషనర్లు ఉన్నట్టు ప్రభుత్వం ఓ స్టేట్ మెంట్ లో పేర్కొంది. ఐటీ జాయింట్ కమిషనర్ అశోక్ అగర్వాల్ ని 1999 నుంచి 2014 వరకు సస్పెన్షన్ లో ఉంచినట్టు ఈ ప్రకటన తెలిపింది. వ్యాపారుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని, వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు చంద్రస్వామి మీద సీబీఐ విచారణ జరపకుండా అడ్డుపడ్డాడని ఈయనపై ఆరోపణలున్నాయి. చంద్రస్వామి తన ఆదాయానికి మించి రూ. 12 కోట్ల మేర ఆస్తులను సంపాదించాడని అప్పట్లోనే అభియోగాలు వచ్చాయి. అలాగే 1989 బ్యాచ్ కు చెందిన రెవెన్యూ సర్వీసు అధికారి ఎస్.కె. శ్రీవాస్తవ..ఇద్దరు మహిళా అధికారులను లైంగికంగా వేధించాడట. అవినీతికి, వ్యభిచారానికి పాల్పడాలని వారిని ఒత్తిడి చేశాడని, పన్నులు చెల్లించకుండా ఎగగొట్టాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. ఈ ‘ అవినీతి జలగ ‘ తనపై శాఖాపరమైన విచారణ జరగకుండా సెంట్రల్ అడ్మిని స్ట్రేటివ్ ట్రిబ్యునల్ లో గత 10 సంవత్సరాల్లో 75 పిటిషన్లు దాఖలు చేశాడట.. పైగా హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా ఎక్కాడని తెలిసింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు మాజీ చైర్మన్, సభ్యులపై ఆరోపణలు చేసినందుకు ఇతనికి 15 రోజుల సాధారణ జైలు శిక్ష కూడా పడింది. హోమీ రాజ్ వంశ్ అనే అధికారి అవినీతికి పాల్పడి రూ, 3.17 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించినట్టు తేలింది. ఇతడ్ని అరెస్టు చేసి సస్పెండ్ చేశారు.