కేసీఆర్ అంటే..కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..అన్న మాటకు కొత్త నిర్వచనం చెప్పారు ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్. కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన కొత్త అర్థం అందరిలో ఆసక్తి రేపింది.

కేసీఆర్ అంటే..కొత్త నిర్వచనం చెప్పిన కేటీఆర్..
Follow us

|

Updated on: May 29, 2020 | 1:12 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..అన్న మాటకు కొత్త నిర్వచనం చెప్పారు ఐటీ పురపాలక మంత్రి కేటీఆర్. కేసీఆర్ కుమారుడు, టీఆర్ఎస్ కార్యనిర్వాహాక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన కొత్త అర్థం అందరిలో ఆసక్తి రేపింది. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని మంత్రి కేటీఆర్ వివరణ ఇచ్చారు. కొండపోచమ్మ ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న కేసీఆర్ అపరభగీరథుడని పేర్కొన్నారు. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తున ఉన్న మేడిగడ్డ నుంచి 618 మీటర్ల ఎత్తున ఉన్న కొండపోచమ్మ వరకు గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాళేశ్వరాన్ని యువ తెలంగాణ రాష్ట్రం.. కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి ఘనత సాధించిందని చెప్పారు.

కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌ను(మర్కూక్‌) సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. చినజీయర్‌ స్వామితో కలిసి ఆయన మోటార్‌ ఆన్‌ చేశారు. దీంతో కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు పరవళ్లు తొక్కాయి. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తున నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయడం ద్వారా రాష్ట్రం కొత్త చరిత్రని లిఖించినట్టయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టానికి ఈ రోజు తెరలేచింది.

Latest Articles
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
మంచి మనసు చాటుకున్న స్టైలీష్ స్టార్..
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
భారతదేశంలో గూగుల్ పిక్సెల్ 8 ఏ లాంచ్.. రూ.20 వేల తగ్గింపు
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఇల్లు అద్దెకు ఇస్తున్నారా ? ఈ డాక్యుమెంట్ లేకపోతే జైలుకు వెళతారు!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!
ఆరేళ్ల బిడ్డను మొసళ్ళకు ఆహారంగా వేసిన తల్లి..!