Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

కేసీఆర్ పుట్టినరోజుకు కేటీఆర్ బంపర్ ఆఫర్

ktr bumper offer to officers, కేసీఆర్ పుట్టినరోజుకు కేటీఆర్ బంపర్ ఆఫర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తన తండ్రి పుట్టినరోజు కోసం అధికారగణానికి, పార్టీ వర్గాలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి పుట్టిన రోజున పర్యావరణం కోసం ప్రతినపూనునదామంటూ అధికారులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతీ ఒక్కరం ఒక మొక్క నాటుదామని మంత్రి కేటీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు పిలుపునిచ్చారు.

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కెసీఆర్ జన్మదినం అన్న సంగతి అందరికీ తెలిసిందే. సీఎం బర్త్ డే సందర్భంగా హరితహారంలో భాగంగా ఒక్కో మొక్క నాటాలని ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్లకు సూచించారు కేటీఆర్. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కెసీఆర్ జన్మదిన సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు.

ఫిబ్రవరి 17వ తేదీన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు తన 66వ సంవత్సరంలో కి అడుగుపెట్టనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రీన్ కవర్‌ని పెంచేందుకు పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి మొక్కల పెంపకం పట్ల తన ఇష్టాన్ని గతంలో చాటుకున్నరన్నారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ మేరకు తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లను కోరారు.

Related Tags