కోడెల శివరామ్‌కు కోర్టులో రిలీఫ్..!

Kodela son sivaram attends mangalagiri court in assembly furniture case, కోడెల శివరామ్‌కు కోర్టులో రిలీఫ్..!

ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరామ్‌కు మంగళగిరి కోర్టులో ఊరట లభించింది. ఏపీ శాసనసభకు సంబంధించిన ఫర్నిచర్‌ గుంటూరులోని తన హీరో హోండా షోరూమ్‌కు తరలించినట్టు ఆయనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావు బుధవారం విచారణ చేపట్టారు. శివరాం పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. అక్టోబరు 9లోపు దిగువ కోర్టులో లొంగిపోయి బెయిలు పొందాలని స్పష్టం చేశారు. అంతేకాదు, రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు తీసుకొని బెయిలు మంజూరు చేయాలని మెజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇవాళ మంగళగిరి కోర్టులో లొంగిపోయి.. బెయిల్ కోసం పిటిషన్ వేశారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూర్ చేసింది. ప్రతి శుక్రవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని శివరామ్‌ను కోర్టు ఆదేశించింది.

మరోవైపు కోడెల ఆత్మహత్యకు సంబంధించిన కేసు విచారణను వేగవంతం చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కోడెల ఫోన్‌తో పాటు.. శివరామ్ స్టేట్మెంట్‌ కోసం గుంటూరు వెళ్లనున్నారు. అక్కడే శివరాం ఇచ్చే స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *