Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

మహేశ్‌తో ‘కేజీఎఫ్’ డైరక్టర్..?

, మహేశ్‌తో ‘కేజీఎఫ్’ డైరక్టర్..?

‘కేజీఎఫ్‌’ చిత్రంతో దేశవ్యాప్తంగా పేరును సంపాదించుకున్నాడు కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ రెండో భాగాన్ని తెరకెక్కిస్తోన్న ప్రశాంత్‌కు పలు భాషల సినీ పరిశ్రమల నుంచి పిలుపులు వస్తున్నాయి. అతడితో పనిచేసేందుకు పేరు మోసిన నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ప్రశాంత్ నీల్ పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే మహేశ్ బాబు భార్య నమ్రతను ప్రశాంత్ కలిసినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే ఓ మంచి కథతో ప్రశాంత్, మహేశ్‌ను కలవనున్నట్లు సమాచారం. ఒకవేళ ప్రశాంత్ తన కథతో మహేశ్‌ను ఒప్పిస్తే మహేశ్ బాబు సొంత నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు టాక్. అంతేకాదు అన్నీ కుదిరితే మహేశ్ 27వ చిత్రంగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లనుందట. మరి మహేశ్‌ను ప్రశాంత్ ఏ మేరకు ఒప్పిస్తాడు..? ఎన్ని భాషలలో ఈ చిత్రం రానుంది..? ఈ విషయాలన్నీ తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.