కరోనా క్వారంటైన్ ‘లెక్క’ పెరుగుతోందట.. కేరళ డాక్టర్ల వెల్లడి

కేరళ డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినవారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్నది నియమం. అయితే దీనికి 14 రోజులే కాదని, దీనికి  రెట్టింపు.

కరోనా క్వారంటైన్ 'లెక్క' పెరుగుతోందట.. కేరళ డాక్టర్ల వెల్లడి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 17, 2020 | 6:20 PM

కేరళ డాక్టర్లు ఓ షాకింగ్ న్యూస్ తెలిపారు. కరోనా పాజిటివ్ లక్షణాలు కనబడినవారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలన్నది నియమం. అయితే దీనికి 14 రోజులే కాదని, దీనికి  రెట్టింపు.. అంటే 28 రోజులు క్వారంటైన్ అవసరమయ్యేట్టు కనిపిస్తోందని ఈ డాక్టర్లు అంటున్నారు. ఉదాహరణకు దుబాయ్ నుంచి కన్నూర్ జిల్లాకు చేరుకున్న ఓ వ్యక్తికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడలేదని, కానీ ఈ నెల 14 న టెస్ట్ చేస్తే ‘అసలు విషయం’ బయటపడిందని ఓ డాక్టర్ తెలిపారు.  14 రోజుల పాటు  ఐసోలేషన్ లో ఉన్నా అవి తగ్గకపోవడంతో.. ఇంట్లోనే మరో 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించామన్నారు. అంటే మొత్తం 28 రోజులయ్యాయి. ట్రావెల్ హిస్టరీ కారణంగా ఈ వ్యక్తికి ఇన్ని రోజుల సమయం అవసరమైందన్నారు. ఇలాగే హైరిస్క్ కేటగిరీలోనివారికి ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడకున్నా..తప్పనిసరిగా ఇన్ని  రోజులూ స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలన్నది ఆ డాక్టర్ అభిప్రాయంగా కనిపిస్తోంది. దుబాయ్ నుంచి తిరిగి వఛ్చిన మరో ఇద్దరు వ్యక్తులకు కూడా వైద్యులు 28 రోజుల సెల్ఫ్ ఐసోలేషన్ సూచించారు.

14 రోజుల క్వారంటైన్ తరువాత కూడా ఆరోగ్యంగా.. ఎలాంటి పాజిటివ్ లక్షణాలు కనబడని వ్యక్తులు తమకు తెలియకుండానే  ఈ  వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారన్న ఆందోళనను ఈ డాక్టర్ వ్యక్తం చేశారు. అయితే దేశంలోని ఇతర కేసుల విషయం నార్మల్ గానే ఉందని ఆయన పేర్కొన్నారు.

Latest Articles
ఇదెక్కడి మాస్ రా మావా..! ప్రభాస్ కల్కిలో మహేష్ బాబు..
ఇదెక్కడి మాస్ రా మావా..! ప్రభాస్ కల్కిలో మహేష్ బాబు..
తృటిలో తప్పిన పెను ప్రమాదం..చింతపల్లి ఘాట్ రోడ్డులో వస్తుండగా..
తృటిలో తప్పిన పెను ప్రమాదం..చింతపల్లి ఘాట్ రోడ్డులో వస్తుండగా..
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
షాకింగ్ యాక్సిడెంట్.. రెప్పపాటులో పెను ప్రమాదం.. వీడియో వైరల్
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
వీడియో చూస్తే నమ్మలేరు.. నిజంగా టీ అమ్మి కోటీశ్వరుడైన చాయ్ వాలా
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
ఆకులు కాదు ఇవి బ్రహ్మాస్త్రాలు.. ఉదయాన్నే పరగడుపున నాలుగు తింటే..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..