టీడీపీకి మరో షాక్.. కేఈ ప్రభాకర్ రాజీనామా..

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకముందే.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వరుసగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సైకిల్ దిగి.. వైసీపీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని.. నిజమైన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం […]

టీడీపీకి మరో షాక్.. కేఈ ప్రభాకర్ రాజీనామా..
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 2:03 PM

స్థానిక సంస్థల ఎన్నికలు జరగకముందే.. టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే వరుసగా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు సైకిల్ దిగి.. వైసీపీ గూటికి చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నేత, టీడీపీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కార్యకర్తలతో సమావేశం అనంతరం ఆయన పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని.. నిజమైన కార్యకర్తలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదని.. కొందరు బీజేపీలో ఉంటూ.. టీడీపీలో పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీలో చేరుతానన్నది త్వరలోనే చెబుతానని.. తాను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై వైసీపీ సహకారం కూడా ఉందని అన్నారు. దీంతో ఆయన వైసీపీలో చేరుతున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.

మరోవైపు తమ్ముడు కేఈ ప్రభాకర్ చేరికపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి. డోన్‌లో టీడీపీ నుంచి ఎవరినీ పోటీకి పెట్టడం లేదని.. ఇక్కడ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని.. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే పోటీ నుంచి విరమించుకున్నారు.