మనస్తాపంతోనే కర్ణాటక కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య చేసుకున్నారా ? సూసైడ్ నోట్ లో ఏముంది ? పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది ?

కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ఎస్.ఎల్. ధర్మేగౌడ మృత దేహం మంగళవారం తెల్లవారుజామున చిక్ మగుళూరు లోని ఓ రైల్వే ట్రాక్ పై కనిపించింది..

మనస్తాపంతోనే కర్ణాటక కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య చేసుకున్నారా ? సూసైడ్ నోట్ లో ఏముంది ? పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 29, 2020 | 10:57 AM

కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ఎస్.ఎల్. ధర్మేగౌడ మృత దేహం మంగళవారం తెల్లవారుజామున చిక్ మగుళూరు లోని ఓ రైల్వే ట్రాక్ పై కనిపించింది. ఇది ఆత్మహత్యేనని, సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. సుమారు 2 గంటల ప్రాంతంలో ధర్మేగౌడ మృత దేహాన్ని కనుగొన్నట్టు వారు చెప్పారు. తన శాంత్రో కారులో సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరిన ఆయన మళ్ళీ కనిపించలేదు. ఇంటికి వెళ్లాలని,రైల్వే స్టేషన్ లో తనకు  చిన్న పని ఉందని ఆయన తన డ్రైవర్ తో చెప్పారట. రాత్రి 10 గంటలవుతున్నా ఆయన నుంచి ఎలాంటి సమాచారమూ ఆయన కుటుంబసభ్యులకు తెలియలేదు.

జనతాదళ్-సెక్యులర్ పార్టీ నేత అయిన ధర్మేగౌడ ఇటీవల కౌన్సిల్ లో జరిగిన గొడవతో తీవ్ర మనస్తాపానికి గురైనట్టు భావిస్తున్నారు. కౌన్సిల్ సభ్యులు ఆయనను సీటు నుంచి కిందికి లాగి పడవేసి దాడి చేసినంత పని చేశారు. ఈ షాకింగ్ వీడియో సంచలనం కలిగించింది. కౌన్సిల్ చైర్మన్ కె.ప్రతాపచంద్ర శెట్టిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చ జరుగుతున్న సమయంలో విపక్ష కాంగ్రెస్ సభ్యులు..చైర్మన్ స్థానంలో ఉన్న ధర్మేగౌడ ను ఆగ్రహంతో కుర్చీ నుంచి లాగేశారు. పాలక బీజేపీతో ఈయన కుమ్మక్కు అవుతున్నారని వారు రోపించారు.

65 ఏళ్ళ ధర్మేగౌడకు తమ పార్టీ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే ఆయన కుమారుడు మాజీ సీఎం కుమారస్వామికి కూడా ఈయన  ఆప్తుడు. 2018 లో ఈయన కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ధర్మేగౌడ ఈ పోస్టుకు ఎన్నిక కావడం నాడు ఆశ్చర్యం కలిగించింది. కాగా మాజీ ప్రధాని  దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామి, సీఎం యెడ్యూరప్ప తదితర నేతలు ధర్మే గౌడ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఇది అత్యంత దురదృష్ట ఘటనగా వారు పేర్కొన్నారు.

Read More:

Live Updates: ధర్మేగౌడ డెత్ మిస్టరీ.. వివాదాస్పదంగా మారుతున్న కర్ణాటక మండలి డిప్యూటీ స్పీకర్ మృతి..

భయపెడుతున్న యూకే వైరస్ కరోనా వైరస్ తో పరివర్తనాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

తెలంగాణలో ‘స్ట్రెయిన్’ టెన్షన్.. కొనసాగుతున్న జీన్ మ్యాపింగ్ టెస్టులు.. ఇంకా లభ్యం కాని 156 మంది ఆచూకీ.!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు