సోము వీర్రాజుకు క‌న్నా శుభాకాంక్ష‌లు..అంతా ఓకేనా..

ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును కొత్త‌ అధ్యక్షుడిగా నియమించింది అధిష్ఠానం.

సోము వీర్రాజుకు క‌న్నా శుభాకాంక్ష‌లు..అంతా ఓకేనా..
Follow us

|

Updated on: Jul 28, 2020 | 11:20 AM

AP BJP NEW CHIEF:  ఏపీ బీజేపీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజును కొత్త‌ అధ్యక్షుడిగా నియమించింది అధిష్ఠానం. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేశారు.

సోము వీర్రాజుకు నాలుగు దశాబ్దాలుగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలో త‌న మార్క్ వేశారు. సుదీర్ఘకాలం బీజేపీ కార్యవర్గంలో పని చేశారు. 2014 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ను బీజేపీతో చేతులు కలపడంలో కీలకపాత్ర పోషించారు. గతంలో అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు తర్వాత ప్రముఖంగా వీర్రాజు పేరు వినిపించగా.. చివ‌రి నిమిషంలో కన్నా లక్ష్మీనారాయణ తెరపైకి వ‌చ్చి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు.

కాగా కొత్త అధ్య‌క్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజుకు మాజీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ శుభాకాంక్షలు తెలిపారు. “భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షులుగా నియమించబడిన ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు” అని క‌న్నా ట్వీట్ చేశారు.

టీడీపీకి క‌న్నా అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబు చెప్పినట్లు న‌డుచుకుంటున్నార‌ని..సొంత పార్టీ నేత‌ల‌తో పాటు వైసీపీ కీలక నేతల కూడా కన్నాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రాజధాని బిల్లుల్ని ఆమోదించొద్దంటూ గవర్నర్ కు కన్నా రాసిన లేఖ పార్టీలో తీవ్ర అల‌జ‌డి చెల‌రేగింది. పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా, కనీసం ఎవరితోనూ సంప్ర‌దించకుండా లేఖ రాయడమేంటని కన్నాపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు స‌మాచారం.

Read More : ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్.. ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు