ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్… ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు

రైతుల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చేందుకే ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే.

ఏపీ రైతుల‌కు గుడ్ న్యూస్... ఆర్‌బీకేల్లో మార్కెటింగ్ సేవ‌లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 28, 2020 | 9:16 AM

RBKs : రైతుల‌కు ప్ర‌యోజ‌నాలు చేకూర్చేందుకే ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌వ్యాప్తంగా ప్ర‌తిష్ఠాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే అన్న‌దాత‌ల‌కు మంచి ధ‌ర అందించేందుకు రైతు భరోసా కేంద్రాల్లో మార్కెటింగ్ సేవ‌ల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్న‌ట్టు మంత్రి క‌న్న‌బాబు తెలిపారు. ప్రకృతి విధానంలో తూర్పుగోదావరి జిల్లాలో మొద‌టిసారి బీపీటీ 2841 నల్ల రకం బియ్యం సాగును మండపేట మండలంలోని అర్తమూరుకు చెందిన వైసీపీ నేత‌ కర్రి పాపారాయుడు పొలంలో మంత్రి కన్నబాబు, ఎంపీ(రాజ్య‌స‌భ‌) పిల్లి సుభాష్ చంద్రబోస్‌ సోమవారం ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కన్న‌బాబు..రైతులకు మంచి ధర అందేలా సాగుదారుల‌కి , కొనుగోలుదారునికి మధ్య ఆర్‌బీకేల్లోని మార్కెటింగ్ సెంటర్స్ అనుసంధానంగా పనిచేస్తాయ‌ని వివ‌రించారు. సరైన ధర లేకుంటే పంట‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంద‌ని తెలిపారు. ఎటువంటి అవ‌త‌వ‌క‌ల‌కు తావులేకుండా ఏడాదిలో రూ.10,200 కోట్ల సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్ల‌లో జమ చేసిన‌ట్లు మంత్రి వివరించారు. కూలీల కొరతను అధిగమించేందుకు ఈ ఏడాది రూ.1,700 కోట్లతో యాంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తున్నట్లు క‌న్న‌బాబు తెలిపారు.

Read More :ఏపీ పేద‌ల‌కు స‌ర్కార్ గుడ్ న్యూస్..ఇళ్ల నిర్మాణానికి చౌక ధ‌రకే సామాగ్రి

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్