‘దుర్గామాత’గా కమలా హారిస్, మేనకోడలి క్యారికేచర్, హిందూ గ్రూప్స్ ఫైర్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ చేసిన ఓ ‘చిలిపి పని’ హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. కమలా హారిస్ ను దుర్గామాతగా, డొనాల్డ్ ట్రంప్ ను ‘ రాక్షసుడి’గా, జో బైడెన్ ని ‘సింహం’ గా చిత్రీకరిస్తూ ఆమె వేసిన క్యారికేచర్ దారుణమని హిందూ గ్రూప్స్ తప్పు పట్టాయి. ఇందుకు మీనా  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్, హిందూ […]

'దుర్గామాత'గా కమలా హారిస్, మేనకోడలి క్యారికేచర్, హిందూ గ్రూప్స్ ఫైర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 20, 2020 | 3:41 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కమలా హారిస్ మేనకోడలు మీనా హారిస్ చేసిన ఓ ‘చిలిపి పని’ హిందూ సంఘాల ఆగ్రహానికి కారణమైంది. కమలా హారిస్ ను దుర్గామాతగా, డొనాల్డ్ ట్రంప్ ను ‘ రాక్షసుడి’గా, జో బైడెన్ ని ‘సింహం’ గా చిత్రీకరిస్తూ ఆమె వేసిన క్యారికేచర్ దారుణమని హిందూ గ్రూప్స్ తప్పు పట్టాయి. ఇందుకు మీనా  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. హిందూ అమెరికన్ ఫౌండేషన్, హిందూ అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తదితర సంఘాలు ..మీనా గారి నిర్వాకాన్ని ఖండించాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా హిందువులను బాధించిందని పేర్కొన్నాయి. ఒక మతానికి సంబంధించిన ఇమేజీలను వినియోగించకుండా గైడ్ లైన్స్ ఉండాలని అమెరికన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సూచించింది. తన క్యారికేచర్ పై ఇంత పెద్ద ఎత్తున దుమారం రావడంతో మీనా హారిస్ తన ట్వీట్స్ నుంచి ఆ క్యారికేచర్ ని తొలగించింది.