కామెడీ కింగ్ కేఏ పాల్ ఎక్కడ..?

ఎన్నికల హీట్‌ను తనదైన శైలి సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల ప్రచారం సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. కేఏ పాల్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్‌లో కూడా కేఏ పాల్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆయన పార్టీకి సున్నా సీట్లు వస్తాయని సర్వే సంస్థలు ఇచ్చినా బాగుండేది. అదీ […]

కామెడీ కింగ్ కేఏ పాల్ ఎక్కడ..?
Follow us

| Edited By: Srinu

Updated on: May 21, 2019 | 7:46 PM

ఎన్నికల హీట్‌ను తనదైన శైలి సీరియస్ కామెడీతో ప్రజల దృష్టిని ఆకర్షించాడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఎన్నికల ప్రచారం సమయంలో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. కేఏ పాల్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కనీసం ఎగ్జిట్ పోల్స్‌లో కూడా కేఏ పాల్ ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఆయన పార్టీకి సున్నా సీట్లు వస్తాయని సర్వే సంస్థలు ఇచ్చినా బాగుండేది. అదీ చేయకపోవడంతో పాల్ అభిమానులు తెగ బాధపడుతున్నారని చెప్పాలి.

ఓ వైపు చంద్రబాబు మరోవైపు జగన్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటూ రాజకీయాన్ని హీటెక్కిస్తుంటే.. కేఏ పాల్ మాత్రం ప్రచార సమయంలో తన స్టైల్ కామెడీని పండించారు. అంతేకాదు ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలతో కూడా డాన్స్‌లు చేయించడం పాల్‌కి మాత్రమే సాధ్యమవుతుంది.

తాను ముఖ్యమంత్రిని అయ్యాక.. చంద్రబాబు‌ని అసిస్టెంట్‌గా పెట్టుకుంటానని.. జగన్ తనకు పోటీనే కాదంటూ జోకులు వేశారు. ఇక అసలు జనసేనను లెక్కలోకి తీసుకోకపోవడం ఇలా పాల్ తన కామెడీ టైమింగ్, చేష్టలతో జనాన్ని నవ్వించారు. ఒక్కసారిగా హీట్ ఎక్కిన ఎన్నికల ప్రచారాలను పాల్ వచ్చి కూల్ చేశారు.

దాదాపు నెలన్నర పాటు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అయిన కేఏ పాల్‌ను ఆదివారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అస్సలు ప్రస్తావించనే లేదు. ఏపీకి తాను సీఎం అవుతానని.. ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే‌ను గెలిపించిన నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తానని.. ఇలా ఆయన ఎన్నికల ప్రచార వేళ చేసిన ప్రతీ మాట కామెడీని పంచాయి. అలాంటి పాల్‌ను జాతీయ సర్వే సంస్థల దగ్గర నుంచి ప్రాంతీయ ఛానల్స్ వరకు ఆటలో అరటిపండులా తీసి పారేశారని చర్చ జరుగుతోంది. ఇకపోతే ఏపీలో ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ మధ్య సాగింది. అటు జనసేన కొన్ని స్థానాల్లో ప్రభావం చూపించిన మాట వాస్తవం. ప్రజాశాంతి పార్టీ ఊసు మాత్రం ఎక్కడా కనపడకపోవడం విశేషం.

మరోవైపు పోలింగ్ ముగిసిన తర్వాత  కేఏ పాల్ అమెరికాలోని హుస్టన్‌లో 30 ఏళ్లుగా తానుంటున్న ఇంటికి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. పోలింగ్ ముగిశాక జగన్ సీఎం అని చెప్పి అమెరికా వెళ్ళిపోయిన పాల్ మళ్ళీ కనిపించలేదు. మే 23 తర్వాత ఈయన అసలు స్పందిస్తారా.?  ఇండియాకు తిరిగి వస్తారా అనేది వేచి చూడాలి.