సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది.. పాక్ టెర్రర్‌ క్యాంపుల గురించి గుట్టురట్టు..!

పాకిస్థాన్.. ఇది ఉగ్రవాదులకు స్వర్గధామం లాంటిది. ఇది దీని గురించి తెలిసిన ఏ దేశమైనా అవుననే అంటుంది. ఎందుకంటే.. యథేచ్చగా ఇక్కడ ఉగ్రవాదులు తిరుగుతున్నా.. పట్టించుకునే వారే ఉండరు. గతంలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. అసలు పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఎలా సంచరిస్తుంటారన్నది. అంతేకాదు.. అక్కడ అనేక ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు కూడా.. ఉగ్రవాదులకు ట్రైనింగ్‌ పాక్‌లోనే ఇస్తుంటారని.. ఆరోపణలు […]

సజీవంగా పట్టుబడ్డ ఉగ్రవాది.. పాక్ టెర్రర్‌ క్యాంపుల గురించి గుట్టురట్టు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2020 | 7:33 PM

పాకిస్థాన్.. ఇది ఉగ్రవాదులకు స్వర్గధామం లాంటిది. ఇది దీని గురించి తెలిసిన ఏ దేశమైనా అవుననే అంటుంది. ఎందుకంటే.. యథేచ్చగా ఇక్కడ ఉగ్రవాదులు తిరుగుతున్నా.. పట్టించుకునే వారే ఉండరు. గతంలో శ్రీలంక క్రికెటర్లపై ఉగ్రవాదులు జరిపిన దాడి గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. అసలు పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు ఎలా సంచరిస్తుంటారన్నది. అంతేకాదు.. అక్కడ అనేక ఉగ్రవాద క్యాంపులు ఉన్నాయి. ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు కూడా.. ఉగ్రవాదులకు ట్రైనింగ్‌ పాక్‌లోనే ఇస్తుంటారని.. ఆరోపణలు ఉన్నాయి. అయితే పాక్ ప్రభుత్వం మాత్రం వాటిని కొట్టిపారేస్తుంది. తాజాగా.. ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌ గురించి తెలుసుకుంటే.. పాక్‌ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. నాలుగైదు రోజుల క్రితం.. ఆఫ్ఘనిస్థాన్ భద్రతా దళాలకు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఒకడు పట్టుబడ్డాడు. ఆ ఉగ్రవాదిని విచారించగా.. పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయని.. ఆఫ్ఘన్ ప్రభుత్వం వెల్లడించింది. ఆఫ్ఘన్ భద్రతా బలగాలు చెప్పిన వివరాల ప్రకారం..

ఈ నెల 13-14వ తేదీల మధ్య రాత్రి సమయంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు టెర్రరిస్టులు.. పాక్‌ -ఆఫ్ఘన్ బార్డర్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన ఆఫ్ఘన్ భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో.. భద్రతా బలగాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో పది మంది జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఐదు మంది ఆఫ్ఘన్ తాలిబన్‌ ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఓ నలుగురు ఆఫ్ఘన్‌ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఒక ఉగ్రవాదిని మాత్రం భద్రతా బలగాలు సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మృతిచెందిన ఉగ్రవాదుల వద్ద నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక పట్టుబ్డడ ఉగ్రవాదిని విచారించగా.. తాను ఆఫ్ఘన్‌కు రావడం ఇదే తొలిసారంటూ.. పలు సంచలన విషయాలు చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. తాను పాకిస్థాన్‌లో నాలుగు నెలలపాటు శిక్షణ పొందినట్లు తెలిపాడు. శిక్షణ ముగిసిన తర్వాత.. తనకు ఆఫ్ఘన్‌లోకి ప్రవేశించి దాడులు జరపాలని ఆదేశించారని.. ఇందుకు తాలిబన్‌ ఉగ్రవాదులతో కలిసి శిక్షణ తర్వాత తనను ఆఫ్ఘనిస్థాన్ పంపించారని, అక్కడ దాడులు నిర్వహించాలని ఆదేశించారని చెప్పాడు. తాలిబాన్ ఉగ్రవాదులతో కలిసి తాను ఆఫ్ఘనిస్థాన్‌లోని నన్‌గర్హర్ ప్రావిన్స్‌లోని మొహ్మంద్ ప్రాంతంలోకి పది రోజుల క్రితమే చేరుకున్నట్లు తెలిపాడని ఆఫ్ఘన్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఉగ్రవాదులందరికీ పాక్‌లోనే శిక్షణ జరుగుతుందని ఈ ఘటనతో స్పష్టం అవుతోంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు