నిన్న అమర్‌నాథ్.. నేడు దుర్గా మాత యాత్రకూ బ్రేక్

ఉగ్రవాదుల ముప్పు ఉందన్న కారణంగా అమర్ నాథ్ యాత్రను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నిన్న నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటలు గడవక ముందే.. మరో యాత్రకు బ్రేకులు వేసింది. ప్రతి ఏటా జరిగే మచేల్ మాతా యాత్రను ఈ సారి భద్రతా కారణాల దృష్ట్యా మధ్యంతరంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.దీంతో దుర్గామాత ఆలయం వద్దకు జరిగే ఈ మచైల్ యాత్రకు ప్రారంభ స్థానమైన 320 కిలోమీటర్ల దూరంలోని ఉదంపూర్ వద్ద యాత్రికులను నిలిపివేశారు. అయితే 43 […]

నిన్న అమర్‌నాథ్.. నేడు దుర్గా మాత యాత్రకూ బ్రేక్
Follow us

| Edited By:

Updated on: Aug 03, 2019 | 5:11 PM

ఉగ్రవాదుల ముప్పు ఉందన్న కారణంగా అమర్ నాథ్ యాత్రను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం నిన్న నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే 24 గంటలు గడవక ముందే.. మరో యాత్రకు బ్రేకులు వేసింది. ప్రతి ఏటా జరిగే మచేల్ మాతా యాత్రను ఈ సారి భద్రతా కారణాల దృష్ట్యా మధ్యంతరంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.దీంతో దుర్గామాత ఆలయం వద్దకు జరిగే ఈ మచైల్ యాత్రకు ప్రారంభ స్థానమైన 320 కిలోమీటర్ల దూరంలోని ఉదంపూర్ వద్ద యాత్రికులను నిలిపివేశారు. అయితే 43 రోజ‌ల పాటు మ‌చేల్ మాతా యాత్ర జ‌ర‌గాల్సి ఉంది. జూలై 25వ తేదీన యాత్ర‌ను మొద‌లుపెట్టారు. సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. ప‌దార్ వ్యాలీలో ఉన్న మాత ద‌ర్శ‌నం కోసం వేలాది మంది భ‌క్తులు వ‌స్తుంటారు. కిష్టావ‌ర్ జిల్లాలోని మ‌చేల్ గ్రామంలో ఉన్న దుర్గా మాత‌ను ద‌ర్శ‌నం చేసుకుంటారు. మాత ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు సుమారు 30 కిలోమీట‌ర్ల దూరం నడవాల్సి ఉంటుంది. శుక్రవారం అమ‌ర్‌నాథ్ యాత్ర‌ను కూడా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఆ మార్గంలో పాక్‌కు చెందిన రైఫిళ్లు, ల్యాండ్‌మైన్లు దొర‌క‌డంతో యాత్రను ర‌ద్దు చేసుకోవాలంటూ ప్ర‌భుత్వం ఆదేశించింది.