ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం!

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రజావేదిక వద్దకు సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు చేరుకున్నారు. ప్రజావేదికలో ఉన్న ఫర్నీచర్, ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామాగ్రి తరలింపుపై సిబ్బందికి సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ సూచనలు ఇచ్చారు. ఈ సూచనల మేరకు ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రికి సంబంధించిన జాబితాను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, […]

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం!
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 9:15 PM

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న అక్రమ నిర్మాణం ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రజావేదిక వద్దకు సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు చేరుకున్నారు. ప్రజావేదికలో ఉన్న ఫర్నీచర్, ఏసీలు, మైక్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ సామాగ్రి తరలింపుపై సిబ్బందికి సీఆర్డీఏ అదనపు కమిషనర్ విజయ కృష్ణన్ సూచనలు ఇచ్చారు. ఈ సూచనల మేరకు ఫర్నీచర్ సహా ఇతర సామాగ్రికి సంబంధించిన జాబితాను సీఆర్డీఏ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రజావేదిక వద్దకు జేసీబీలు, సుత్తెలు, పలుగు, పారలతో కూలీలు చేరుకున్నారు. రాత్రికి ప్రజావేదిక కూల్చివేత పనిని పూర్తి చేయనున్నారు. ప్రజావేదిక ఫర్నిచర్‌, ఎలక్ట్రికల్‌ సామాగ్రిని అధికారులు తరలించారు. హైకోర్టు సమీపంలోని నర్సరీకి పూల కుండీలను తీసుకెళ్లారు.