Breaking News
  • ఈఎస్‌ఐ స్కామ్‌పై స్పందించిన మంత్రి గుమ్మనూరు జయరాం. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుంది. గత ప్రభుత్వంలో ఈఎస్‌ఐలో భారీ అవినీతి జరిగింది-జయరాం. అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించాం. అవినీతిపై విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం-జయరాం. అక్రమంగా చెల్లించిన బిల్లుల సొమ్ము రికవరీ చేస్తాం. అవినీతికి పాల్పడిన వారినెవ్వరినీ వదిలిపెట్టం-మంత్రి జయరాం
  • వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను వక్రీకరించారు-ఇంతియాజ్‌ జలీల్‌. అలాంటి వ్యాఖ్యలను పార్టీ సమర్ధించదు. వారిస్‌ పఠాన్‌ వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. -టీవీ9తో మహారాష్ట్ర ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్‌ జలీల్‌.
  • తూ.గో: అన్నవరం ఆలయానికి కొత్త పాలక మండలి నియామకం. 16 మందితో కొత్త పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
  • ఏపీ ఈఎస్‌ఐ స్కాంలో వివాదాస్పదమైన అప్పటి మంత్రి పితాని వ్యవహారం. మందుల సరఫరా బిల్లుల చెల్లింపులో మొదట సరఫరా చేసిన వాళ్లకే.. బిల్లులు చెల్లించాలని ఆదేశించిన అప్పటి కార్మికశాఖ కార్యదర్శి. కార్మికశాఖ కార్యదర్శి ఆదేశాలను అడ్డుకున్న పితాని సత్యానారాయణ. తమకు నచ్చిన వాళ్లకే ఇచ్చేలా వ్యవహరించారని పితానిపై ఆరోపణలు.
  • ప్రకాశం: ఒంగోలులో ఏఎన్‌ఎం హైమావతి ఆత్మహత్యాయత్నం. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన హైమావతి. హైమావతి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. విధుల నుంచి తొలగించడంతో ఆత్మహత్యకు యత్నించిందన్న స్థానికులు. తనను పర్మినెంట్‌ చేస్తామంటూ అపోలో ఏజెన్సీకి చెందిన.. ప్రదీప్‌, గణేష్‌లు రూ.3 లక్షలు తీసుకున్నారని హైమావతి ఆరోపణలు.

సఫారీలపై గెలుపు.. ఇదీ ఓ ఘన విజయమేనా?

Did India Really Defeated South Africa In Every Aspects, సఫారీలపై గెలుపు.. ఇదీ ఓ ఘన విజయమేనా?

అంతర్జాతీయ క్రికెట్‌ను టీమిండియా శాసిస్తోందని అని చెప్పడంలో వింతేమీ లేదు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ జట్టు అద్భుత విజయాలు అందుకుంటోంది. ప్రత్యర్థి టీమ్ ఏదైనా.. కోహ్లీసేన చూసి బెంబేలెత్తిపోతున్నారు. రీసెంట్‌గా సఫారీలతో స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు ఎక్కడా కూడా భారత్‌కు తగినంత పోటీ ఇవ్వలేదని చెప్పొచ్చు. అయితే భారత్ అత్యుత్తమ మేటి జట్టని కొందరు అంటుంటే.. సఫారీల నిలకడలేమి వల్లనే భారత్ గెలిచిందని మరికొందరు వాదిస్తున్నారు.

ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ తప్పితే.. ఇంకెవ్వరూ సీనియర్ ఆటగాళ్లు లేరన్న మాట వాస్తవం. డివిలియర్స్, ఆమ్లా లాంటి టెస్ట్ బ్యాట్స్‌మెన్ రీసెంట్‌గానే రిటైర్మెంట్ ప్రకటించారు. దీనితో సఫారీలకు పెద్ద దెబ్బ పడింది. అంతేకాకుండా స్వదేశంలో భారత్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. మరోవైపు సఫారీలు స్పిన్‌తో ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇక టీమిండియాకు స్పినే ప్రధాన బలం. ఇదంతా ఒక ఎత్తయితే.. మరో ఎత్తు టాస్.. మూడు టెస్టుల్లోనూ భారత్ మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

స్వదేశం.. అందులోనూ భారత్ టాస్ విజయం సాధిస్తే.. ఇంకేముంది ప్రత్యర్థులకు చుక్కల కనిపించడం ఖాయమే. సరిగ్గా మూడు టెస్టుల్లోనూ ఇదే జరిగింది. దానితో సఫారీలు ఒకింత కృంగిపోయారని కూడా చెప్పొచ్చు. భారీ స్కోర్.. అందులోనూ ఎదురున్నది బలమైన జట్టు.. ఖచ్చితంగా పొరపాట్లు జరుగుతాయి. సఫారీలు కూడా అదే తడబాటుతో సిరీస్ మొత్తాన్ని చేజార్చుకున్నారు.

భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నది నిజమే. కానీ జట్టులో లోపాలు లేకపోలేదు. ప్రధానంగా మిడిల్ ఆర్డర్ ఇబ్బంది ఉంది. అంతేకాకుండా టెస్టుల్లో ఓపెనర్లు కూడా సరిగ్గా రాణించట్లేదు. ప్రస్తుతం రోహిత్ శర్మ రూపంలో అద్భుతమైన ఓపెనర్ ఉన్నాడు గానీ.. మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. అంతేకాకుండా భారత్ ఇప్పటివరకు చిన్నా చితక జట్లతోనే మ్యాచ్‌లు ఆడి గెలిస్తోంది తప్పితే.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి జట్లతో ఇప్పటివరకు ఆడలేదు.

Related Tags