బీజేపీలోకి ‘ఆది’ చేరికకు బ్రేక్ వేసిందెవరు..!

Breaks for Adi Narayana Reddy to join BJP, బీజేపీలోకి ‘ఆది’ చేరికకు బ్రేక్ వేసిందెవరు..!

ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆ పార్టీకి రాజీనామా చేసిన నాయకుల్లో మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి ఒకరు. బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్న ఆయన.. టీడీపీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇదంతా జరిగి దాదాపు పది రోజులు పూర్తి అవుతోంది. కానీ ఇంతవరకు ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం ఫిక్స్ కాలేదు. అయితే బీజేపీలోకి ఆది నారాయణ చేరకుండా ఓ ఎంపీ అడ్డుకుంటున్నారట. ఆదిపై లేని పోని మాటలను ఆయన బీజేపీ అధిష్టానానికి చెప్పారట. దీంతో కమలనాథులు ఆయనను చేర్చుకోవడానికి వెనకడుగు వేస్తున్నారట. ఈ విషయాన్ని డైరక్ట్‌గా చెప్పలేక.. అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో పది రోజులు అవుతున్నా.. అటు అమిత్ షా గానీ, ఇటు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా గానీ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇంతకు ఆ ఎంపీ ఎవరంటే.. కడప జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అని టాక్.

కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్.. మొన్నటివరకు టీడీపీలో చంద్రబాబుకు సన్నిహితుడిగా మెలిగారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి తరువాత ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక ఇప్పుడు కడప జిల్లా మొత్తం తన చేతిలోనే ఉందని ఫీల్ అవుతున్న రమేష్.. ఆది నారాయణ లాంటి పెద్ద తలకాయను బీజేపీలో చేర్చుకుంటే తనకు అనుగుణంగా పరిస్థితులు అనుకూలించవేమోనని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయనపై బీజేపీ అధిష్టానానికి లేని పోని మాటలు చెప్పినట్లు టాక్. మరి ఇందులో నిజమెంత..? ఆదికి బీజేపీ అధిష్టానం మొండిచేయి చూపినట్లేనా..? ఆది రాజకీయ భవితవ్యం ఏంటి..? అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *