రైనా, హర్భజన్‌లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న సీఎస్‌కే

|

Oct 02, 2020 | 12:23 PM

వ్యక్తిగత కారణంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు సభ్యులైన వీరిద్దరు వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతారా అన్నది సందేహంగా మారింది..

రైనా, హర్భజన్‌లతో ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న సీఎస్‌కే
Follow us on

వ్యక్తిగత కారణంగా ఐపీఎల్‌కు దూరంగా ఉన్న సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌ల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టు సభ్యులైన వీరిద్దరు వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడతారా అన్నది సందేహంగా మారింది.. సురేశ్‌రైనా, హర్భజన్‌సింగ్‌లు ఇక చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టకు ఆడే అవకాశం లేకుండా పోతోంది. కారణం వారిద్దరి ఒప్పందాలను రద్దు చేసుకునే పనిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజ్‌ పడటమే! ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి వారిద్దరి పేర్లను తొలగించిన సీఎస్‌కే ఫ్రాంచైజీ ఇప్పుడు వారితో ఒప్పందాలను రద్దు చేసుకునే పనిలో పడింది.. నిబంధనల మేరకే తాము చర్యలు తీసుకుంటున్నామని సీఎస్‌కే చెబుతోంది.. 2018లో జరిగిన వేలంలో సురేశ్‌ రైనా, హర్భజన్‌సింగ్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుక్కుంది.. వారితో మూడేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకుంది.. ఈ ఒప్పందం ప్రకారం వీరి గడువు ఈ సీజన్‌తో ముగుస్తుంది.. ఏడాదికి 11 కోట్ల రూపాయలతో సురేశ్‌ రైనాను, రెండు కోట్ల రూపాయలతో హర్భజన్‌సింగ్‌ను జట్టులో తీసుకుంది సీఎస్‌కే. ఈ సీజన్‌లో వీరిద్దరు ఆడటం లేదు కాబట్టి కొంత డబ్బును చెల్లించడం లేదట! యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఐపీఎల్‌ కోసం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది సీఎస్‌కే.. అక్కడ కొన్ని రోజులు సురేశ్‌ రైనా ప్రాక్టీస్‌ చేశారు.. జట్టుతో పాటు దుబాయ్‌కు కూడా వెళ్లాడు.. మరి ఈ రోజులకు సంబంధించి డబ్బులు ఇస్తారో ఇవ్వరో ఇంకా తేలలేదు.. ఆడితేనే రెమ్యూనిరేషన్‌ అంటోంది సీఎస్‌కే.. ఈ నవంబర్‌తో ఐపీఎల్‌ సీజన్‌ ముగుస్తుంది.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో 14వ సీజన్‌ మొదలవుతుంది.. షెడ్యూల్‌ ప్రకారం ఐపీఎల్‌ జరుగుతుందా? అసలు ఇండియాలో జరిగే వీలుందా? అన్నది ఇప్పుడే చెప్పలేం.. అసలు బీసీసీఐ ఆటగాళ్ల కోసం వేలం నిర్వహిస్తుందో లేదో కూడా తెలియదు.. మరి వచ్చే సీజన్‌లో సురేశ్‌ రైనా, హర్బజన్‌లు ఆడతారా? వేరే ఫ్రాంచైజ్‌ వీరిని తీసుకుంటుందా? అన్నది చూడాలి.