మరోసారి ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్‌ బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగిసినప్పటికీ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మే 4వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువు పెంచుతున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 26, 27 తేదీల్లో పలు పోటీ పరీక్షలు ఉన్నందున ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో మార్పు చేయాలంటూ వస్తోన్న విజ్ఞప్తుల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు […]

మరోసారి ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 8:16 PM

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్‌ బోర్డు అధికారులు మరోసారి పొడిగించారు. ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగిసినప్పటికీ తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మే 4వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువు పెంచుతున్నట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. అదేవిధంగా ఈ నెల 26, 27 తేదీల్లో పలు పోటీ పరీక్షలు ఉన్నందున ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలులో మార్పు చేయాలంటూ వస్తోన్న విజ్ఞప్తుల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను పునఃసమీక్షించి త్వరలోనే సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా ఖరారు చేస్తామన్నారు.