టిక్ టాక్ పోతే పోయింది…’చింగారి’ వచ్ఛేసిందిగా !

టిక్ టాక్ తో బాటు 58 చైనీస్ యాప్స్ ని ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆ యాప్ పోయిందన్న బాధ కన్నా.. దేశీ యాప్..'చింగారి' యాప్ వచ్ఛేసిందన్న సంతోషం యాజర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చైనీస్ టిక్ టాక్ కి..

టిక్ టాక్ పోతే పోయింది...'చింగారి' వచ్ఛేసిందిగా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 30, 2020 | 3:49 PM

టిక్ టాక్ తో బాటు 58 చైనీస్ యాప్స్ ని ప్రభుత్వం నిషేధించింది. అయితే ఆ యాప్ పోయిందన్న బాధ కన్నా.. దేశీ యాప్..’చింగారి’ యాప్ వచ్ఛేసిందన్న సంతోషం యాజర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చైనీస్ టిక్ టాక్ కి ఇది ప్రత్యామ్నాయమని భావిస్తున్న ఈ యాప్ ని అప్పుడే అనేకమంది డౌన్ లోడ్ చేసుకున్నారట. ఇందులో యూజర్లు వీడియోలను డౌన్ లోడ్, అప్ లోడ్ చేసుకోవచ్చు… ఫ్రెండ్స్ తో చాట్ చేయవచ్ఛు ..కొత్త వారితో ఇంటరాక్ట్ కావచ్ఛు.. కంటెంట్ ని షేర్ చేసుకోవచ్ఛు కూడా అంటున్నారు బెంగుళూరులో దీని ‘సృష్టికర్తలైన’ ప్రోగ్రామర్లు బిశ్వాత్మ నాయక్, సిధ్ధార్థ గౌతమ్. గత ఏడాది వీళ్ళు దీనికి ఓ ‘రూపమిచ్చారు’, గూగుల్ ప్లే స్టోర్ లో మిట్రాన్ యాప్, టిక్ టాక్ క్లోన్ ప్లాట్ ఫామ్ ని మించిపోయి ఇది టాప్ స్పాట్ లో నిలిచిందట. చింగారి యాప్ పై వస్తున్న ట్రాఫిక్ తాము ఊహించినదానికన్నా ఎక్కువగా ఉందని నాయక్ తెలిపారు. అనేకమంది దీనిపట్ల ఆసక్తి చూపుతున్నారని, ఇన్వెస్టర్ల కోసం తాము వేచి ఉన్నామని ఆయన చెప్పారు. టిక్ టాక్ ని ఎప్పుడూ డౌన్ లోడ్ చేసుకోని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుని ‘మోర్ పవర్  టు యు’ అని ట్వీట్ చేశారట. ఇక తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, పంజాబీ, మలయాళం, గుజరాతీ భాషల్లో ఇది లభ్యమవుతుందని నాయక్ చెప్పారు. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ లో ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు.