భారత్ వర్సెస్ సౌతాఫ్రికా : తొలి టీ20 వర్షార్పణం

India Vs South Africa 1st T20I in Dharamsala: Match abandoned, భారత్ వర్సెస్ సౌతాఫ్రికా : తొలి టీ20 వర్షార్పణం

భారత్ – సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన తొలి టీ- ట్వంటీ మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఆగిపోయింది. ధర్మశాల స్టేడియం మొత్తం వాన నీరు నిలిచి ఉండడం వల్ల రిఫరీ మ్యాచ్​ రద్దు చేశారు. కనీసం టాస్ వేసేందుకు కూడా వీలు పడలేదు.ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురుస్తూనే ఉంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచింది సిబ్బంది. మధ్యలో కొంత సేపు వర్షం ఆగినప్పటికీ ఆ తర్వాత వస్తూ, పోతూ ఉంది. దీంతో ఆరు నెలల తర్వాత అభిమానుల మధ్య అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకున్న టీమ్‌ ఇండియా కల, ప్రపంచకప్ చేదు అనుభవాన్ని ఈ మ్యాచ్‌తో చెరిపేసుకోవాలనుకున్న దక్షిణాఫ్రికా ఆశకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం మొహాలిలో రెండో మ్యాచ్‌ జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *