కరోనా ఉగ్రరూపం… రెండు లక్షలు దాటిన కేసులు

కరోనా మహమ్మారి భారత దేశాన్ని గడగడలాడిస్తోంది. గత 15 రోజులుగా కోవిడ్ 19 రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. రెండు లక్షల మార్కును దాటింది. అదికూడా కేవలం 15 రోజుల్లో లక్ష నుంచి 2 లక్షల మార్కును దాటేసింది.

కరోనా ఉగ్రరూపం... రెండు లక్షలు దాటిన కేసులు
Follow us

|

Updated on: Jun 03, 2020 | 12:40 PM

కరోనా మహమ్మారి భారత దేశాన్ని గడగడలాడిస్తోంది. గత 15 రోజుల్లో రెండు లక్షల మార్కును దాటింది. అదికూడా కేవలం 15 రోజుల్లో లక్ష నుంచి 2 లక్షల మార్కును దాటేసింది. ఇంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడం… లక్‌డౌన్ 5.0 వెసులుబాట్లు జనంలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి.

గత నాలుగురోజులుగా దేశంలో ప్రతిరోజూ రికార్డుస్థాయిలో 8వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,07,615కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. అంతేకాకుండా మరణాల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో ప్రతిరోజు దాదాపు 200 మంది మరణిస్తున్నారు. గడచిన 24గంటల్లో కరోనా వైరస్‌తో 217మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 5815 మంది చనిపోయారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే మహమ్మారి బారి నుంచి 1,00,303 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది. ఇక 1,01,487 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయని తెలిపింది.

మరోవైపు భారత్‌లో కోవిడ్‌-19 మరణాలను తక్కువగా చూపుతున్నారనే వార్తలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అధిక జనాబా ఉన్న మన దేశంలో రికవరీ రేటు దాదాపు 50 శాతానికి చేరడం సానుకూల పరిణామమని పేర్కొంది. కొవిడ్‌ మరణాల్లో మాత్రం భారత్‌ ప్రపంచంలో 13వ స్థానంలో ఉంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు