ఈ పేమెంట్స్ చేసే వాళ్లకి గుడ్ న్యూస్

మొబైల్ వ్యాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో చెల్లింపులు చేసేవాళ్లకి గుడ్ న్యూస్. జనవరి 2020 నుండి యుపిఐ లావాదేవీలపై విధించిన రుసుమును తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ బ్యాంకులను..

ఈ పేమెంట్స్ చేసే వాళ్లకి గుడ్ న్యూస్
Follow us

|

Updated on: Aug 31, 2020 | 3:52 PM

మొబైల్ వ్యాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో చెల్లింపులు చేసేవాళ్లకి గుడ్ న్యూస్. జనవరి 2020 నుండి యుపిఐ లావాదేవీలపై విధించిన రుసుమును తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ బ్యాంకులను ఆదేశించింది. భీమ్‌-యూపీఐ, రూపే, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌.. తదితరాలు ఉపయోగించి డిజిటల్‌ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై వినియోగదారులకు ఈ వెసులుబాటు దక్కుతుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంకులను ఈమేరకు సర్యులర్‌ జారీచేసింది. ఈ డిజిటల్‌ చెల్లింపులపై భవిష్యత్తులో కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని తేల్చిచెప్పింది. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ఫైనాన్స్‌ యాక్ట్‌-2019లో సెక్షన్‌ 269 SU చేర్చింది. ఫలితంగా భీమ్‌-యూపీఐ, రూపే- డెబిట్‌కార్డ్‌, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ లావాదేవీలను ఈ సెక్షన్‌ కింద నోటిఫై చేసింది. దాంతో ఈ మార్గాల్లో చేసే చెల్లింపులకు చార్జీలు వసూలు చేయకూడదు. కానీ కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటంతో సీబీడీటీ తాజాగా ఈ సర్క్యులర్‌ను జారీచేసింది. 50 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్‌తో సహా ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా చెల్లింపును స్వీకరించడానికి ఎటువంటి ఛార్జీలు విధించవద్దని కేంద్రం గతంలో బ్యాంకులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో