Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

హీటెక్కిన జార్ఖండ్.. మళ్లీ అదే ప్రచారం చేస్తోన్న బీజేపీ..

Jharkhand Assembly Election 2019 : Amit Shah Focuses On Ayodhya and Kashmir, హీటెక్కిన జార్ఖండ్.. మళ్లీ అదే ప్రచారం చేస్తోన్న బీజేపీ..

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. మరో వారం రోజుల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బీజేపీ తన దూకుడు పెంచింది. ఎట్టిపరిస్థితుల్లోనైనా.. తిరిగి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు కమలనాథులు రంగంలోకి దిగారు. విజయం మనదేనంటూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఈ క్రమంలో గురువారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డెబ్బై ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల ప్రచారంలో మరోసారి కశ్మీర్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఇటీవల మహారాష్ట్ర, హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీజేపీ కశ్మీర్ అంశంతో పాటుగా.. ఎయిర్ స్ట్రైక్ వంటి అంశాలనే ప్రచారాస్త్రాలుగా ఉపయోగించారు. అయితే బీజేపీ అనుకున్నట్లుగా.. ఈ రెండు రాష్ట్రాల్లో ఫలితాలను సాధించలేకపోయింది. మహారాష్ట్రలో అత్యధిక సీట్లు సాధించినా.. ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ బలం లేకపోయింది. ఇక హర్యానాలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అత్యధిక సీట్లను మాత్రం సాధించగలిగారు.. కానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సీట్లను దక్కించుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు జరగుతున్న జార్ఖండ్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇవే అంశాల్నీ ప్రచారాస్త్రాలుగా వాడుతున్నారు. అయితే కశ్మీర్ అంశంతో పాటుగా.. ఇప్పుడు అయోధ్య అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు.

గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్ షా.. కశ్మీర్ ఇష్యూ, అయోధ్య తీర్పుల అంశాలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయోధ్య వివాదం ఇన్ని సంవత్సరాలు పరిష్కారం కాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల అయోధ్య భూ వివాదానికి పరిష్కారం చూపిస్తూ.. సుప్రీం చారిత్రాత్మక తీర్పును వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. సుప్రీం తీర్పుతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలో వద్దో మీరే చెప్పండంటూ ప్రచారంలో ప్రజల్ని ఉద్దేశిస్తూ ప్రసంగం కొనసాగించారు. ఇక కశ్మీర్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు కోసమే వాడుకున్నారని.. ఆర్టికల్ 370 రద్దు చేయకుండా.. కాంగ్రెస్ పార్టీ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో అభివృద్ధికి దారులు వేశారన్నారు.

కాగా.. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 20 వరకు మొత్తం 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో నవంబర్ 30న.. 13 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 23న ఎన్నికల రిజల్ట్స్ వెలుడనున్నాయి.