సూర్యపేట జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు

Election Comission Rajith Kumar, సూర్యపేట జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలు
సూర్యపేట జిల్లాలో ఇవాళ్టి(శనివారం) నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి అక్టోబర్ 21 ఉప ఎన్నిక జరుగుతుందని ఈసీ వెల్లడించారు. ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో ఎన్నిక కోడ్ వెంటనే అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఉన్న ఓటర్ జాబితా ప్రకారం ఉప ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ఈరోజు నుంచి ప్రభుత్వం విధాన ప్రకటనలు చేయకూడదని, జిల్లాలో మంత్రులు అధికారిక పర్యటనల్లో పాల్గొనకూడదని రజత్ కుమార్ చెప్పారు. హుజూర్ నగర్ ఏపీ సరిహద్దుల్లో ఉన్నందున మద్యం, డబ్బు సరఫరాపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా ఎన్నికల ఉల్లంఘనలపై ప్రజలు ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ రజత్ కుమార్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *