భార్యను సజీవ సమాధి చేశాడు.. సీన్ కట్ చేస్తే.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఊసలు లెక్క పెట్టించింది.!

ఓ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఒక మహిళ ప్రాణాలను కాపాడింది. భార్య చేతుల్లో సజీవ సమాధి అయిన ఆమెను రక్షించింది. అతడ్ని ఊసలు లెక్క పెట్టించింది.

భార్యను సజీవ సమాధి చేశాడు.. సీన్ కట్ చేస్తే.. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఊసలు లెక్క పెట్టించింది.!
Apple Watch Rescue

Updated on: Oct 26, 2022 | 12:21 PM

ఓ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఒక మహిళ ప్రాణాలను కాపాడింది. భార్య చేతుల్లో సజీవ సమాధి అయిన ఆమెను రక్షించింది. అతడ్ని ఊసలు లెక్క పెట్టించింది. ఆ వివరాలు ఏంటంటే..

వాషింగ్టన్‌కు చెందిన చాయ్ క్యోంగ్, యంగ్ సూక్ అన్ భార్యాభర్తలు. గత కొంతకాలంగా వీరిద్దరికి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇద్దరూ డివోర్స్ తీసుకోవాలని నిర్ణయించారు. అయితే విడిపోతే 42 ఏళ్ల యంగ్‌ సూక్‌ ఆన్‌‌కు భరణంగా తన రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని.. చాయ్ క్యోంగ్‌ ఆమె చంపాలనుకుంటాడు. ఆలోచన వచ్చిందే తడువుగా అతడు.. ఆమెతో గొడవపడ్డాడు. పక్కా ప్లాన్ వేసి ఆమెను హింసించడంతో పాటు.. టేప్‌తో కట్టేసి ఓ క్యారవ్యాన్‌లో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

అక్కడ సదరు మహిళను సజీవ సమాధి చేశాడు. అయితే ఆమె చేతికి ఉన్న స్మార్ట్ వాచ్.. రాక్షసుడి లాంటి తన భర్త నుంచి దేవుడిలా కాపాడింది. దాని సాయంతో ఆమె అత్యవసర నెంబర్ 911కి కాల్ చేసింది. పోలీసులు రంగంలోకి దిగి.. సదరు మహిళను సమయానికి రక్షించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఖాకీలు.. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Loading...
Unable to load recommendations.
Follow Us