
కన్నీళ్లు చాలా విలువైనవి అని చాలా సార్లు మనం వినే ఉంటాం. ఇది సత్యం ఎందుకంటే నిజంగానే కన్నీళ్లు చాలా విలువైనవి. ఎందుకంటే కన్నీళ్లు రావడం వల్ల మన రోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా కళ్ళ ఆరోగ్యానికి ఇది ఏంతో మంచింది. కన్నీళ్లలో కూడా రకాలు ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో ప్రత్యేక కారణం ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎక్కువగా నవ్వినప్పుడు, మీరు ఒత్తిడికి గురైనప్పుడు, మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా కన్నీళ్లు వస్తాయి. వీటిని భట్టి శాస్త్రవేత్తలు కన్నీళ్లను మూడు రకాలుగా విభజించారు. వాటి గురించి ఇప్పుడు తెలుపుకుందాం.
సాధారణ కన్నీళ్లు
ఇవి నిరంతరం మన కళ్లలో ఉండే నీరు. ఇవి మన కళ్ళు ఎండిపోకుండా కాపాడుతాయి. ఇవి ఎల్లప్పుడూ మన కళ్లను తేమగా ఉంచేందుకు సహాయపడుతాయి. వీటిలో దాదాపు 98 శాతం నీరు ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. కొన్ని సార్లు ఈ కన్నీళ్లు భావోద్వేగాల ద్వారానే కాదు.. ఇతర కారణాల వల్ల కూడా వస్తాయి. ఉదాహరణకు, ఉల్లిపాయలను కోసేటప్పుడు, కళ్ళలో దుమ్ము పడినప్పుడు లేదా బలమైన వాసన వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీళ్లు వస్తాయి. అవి కళ్ళను శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి.
భావోద్వేగమైన కన్నీరు
ఈ కన్నీళ్లు మన భావోద్వేగాలకు నేరుగా సంబంధించినవి. మనకు ఏదైనా బాధ వచ్చినా సంతోషం వచ్చినా.. మెదడులోని లింబిక్ వ్యవస్థ హైపోథాలమస్ నాడీ వ్యవస్థకు సంకేతాలను పంపుతుంది. దీనివల్ల మన కళ్ల నుంచి నీరు బయటకు వస్తుంది. దీని వల్ల మన ఒత్తిడి తగ్గుతుంది.అలాగే మన కళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. భావోద్వేగాలను అపుకోకుండా ఏడవడం మన మొదడుకు మంచింది.
సంతోషంగా ఉన్నప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయి?
మన మెదడులోని భావోద్వేగాలను గుర్తించే భాగం హైపోథాలమస్. మనలో భావోద్వేగాలు ఎక్కువైనప్పుడు ఇది నాడీ వ్యవస్థకు కన్నీళ్లను విడుదల చేయలనే సంకేతాలను పంపుతుంది. అందుకే మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తాము. ఏడుపు అనేది మన శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తుంది. కాబట్టి మీ భావోద్వేగాలను మనసులో దాచుకోకుండా ఏడ్చేసి వాటిని బహిర్గతం చేసుకోండి. దీని వల్ల మీరు ఆరకోగ్యంగా ఉంటారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.