Auto: ఆటోకు మూడు టైర్లే ఎందుకు ఉంటాయో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..

ట్రాఫిక్ నిండిన నగర వీధుల్లో అయినా.. ఇరుకైన పల్లెటూరి గల్లీల్లో అయినా.. సామాన్యుడికి అత్యంత వేగంగా, చౌకగా అందుబాటులో ఉండే ఏకైక రవాణా సాధనం ఆటో. అయితే ఆటోకు కార్లకు ఉన్నట్లు ఆటోలకు నాలుగు టైర్లు ఎందుకు ఉండవు? ఆటో డిజైన్ వెనుక దాగున్న ఆ ఆసక్తికరమైన మిస్టరీ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Auto: ఆటోకు మూడు టైర్లే ఎందుకు ఉంటాయో తెలుసా..? 90శాతం మందికి తెలియదు..
Why Auto Have Only 3 Wheels

Updated on: Feb 21, 2026 | 11:04 AM

మన దేశంలోని నగరాల్లో చౌకైన, వేగవంతమైన ప్రయాణం అంటే మనకు టక్కున గుర్తొచ్చేది ఆటో. కార్లు కొనలేని సామాన్యుడికి ఇది ఒక మినీ కార్. అయితే మనం రోజూ ఆటో ఎక్కుతున్నా.. ఎప్పుడైనా గమనించారా? కార్లకు నాలుగు టైర్లు ఉన్నట్లు ఆటోలకు ఎందుకు ఉండవు? కేవలం మూడు చక్రాలతోనే ఆటోలు ఎందుకు నడుస్తాయి? దీని వెనుక ఉన్న ఆర్థిక, సాంకేతిక కారణాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వాహన తయారీలో చక్రాల సంఖ్య పెరిగే కొద్దీ దాని డిజైన్, ఇంజనీరింగ్, మెటీరియల్ ఖర్చు పెరుగుతుంది. ఆటోను ప్రధానంగా సామాన్యుల కోసం, తక్కువ ధరలో అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో రూపొందించారు. నాలుగు చక్రాల కంటే మూడు చక్రాల వాహనానికి తక్కువ విడిభాగాల అవసరం ఉంటుంది. ఇది తయారీ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. అందుకే ఆటో రిక్షాలు తక్కువ ధరకే లభిస్తాయి.

ఇరుకైన వీధుల్లో కింగ్

భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్, ఇరుకైన గల్లీలు ఎక్కువ. నాలుగు టైర్ల కారు తిరగడానికి కావాల్సిన స్థలంతో పోలిస్తే మూడు చక్రాల ఆటోకు చాలా తక్కువ స్థలం సరిపోతుంది. ఆటో ముందు భాగంలో ఒకే చక్రం ఉండటం వల్ల అది అతి తక్కువ స్థలంలోనే సులభంగా మలుపులు తిరగగలదు. ఇది ట్రాఫిక్ జామ్‌ల నుండి త్వరగా బయటపడటానికి, పార్కింగ్ సమస్యలను అధిగమించడానికి గొప్పగా సహాయపడుతుంది.

తక్కువ బరువు – ఎక్కువ మైలేజీ

ఆటో రిక్షా బరువు చాలా తక్కువగా ఉంటుంది. చక్రాల సంఖ్య తగ్గడం వల్ల ఇంజిన్‌పై భారం తగ్గుతుంది. దీనివల్ల తక్కువ శక్తి గల ఇంజిన్ ఉన్నప్పటికీ, ఆటో వేగంగా కదలగలదు. బరువు తగ్గడం వల్ల ఇంధన వినియోగం కూడా తగ్గి, డ్రైవర్‌కు మంచి మైలేజీ లభిస్తుంది. ఇది అటు డ్రైవర్ లాభాలకు, ఇటు పర్యావరణానికి మేలు చేస్తుంది.

సామాన్యుడి సౌకర్యం

ఆటోలు కేవలం ప్రయాణికులకే కాదు.. చిన్న చిన్న వస్తువుల రవాణాకు కూడా అత్యంత అనుకూలం. తక్కువ ఖర్చుతో గరిష్ట ప్రయోజనం అందించడమే ఆటో డిజైన్ వెనుక ఉన్న అసలు రహస్యం. అందుకే దీనిని సామాన్యుల కారు అని పిలుస్తారు. కాగా కార్లతో పోలిస్తే వేగం లేదా భద్రతలో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. నగరాల్లో స్వల్ప దూర ప్రయాణాలకు ఆటోను మించిన ప్రత్యామ్నాయం లేదు. దాని మూడు చక్రాల డిజైన్ కేవలం స్టైల్ కోసం కాదు.. అది ఒక ఆర్థిక, ఇంజనీరింగ్ అద్భుతం.

Follow Us