Beer Diet: షాకింగ్ అంటే ఇదే.. బీరు మాత్రమే తాగాడు.. 46 రోజుల్లో 20 కేజీలు తగ్గాడు..!

US Man Beer Diet: సంతోషం.. కోపం.. బాధ.. ఎమోషన్‌ ఏదైనా మందు తాగాల్సిందే. నిజానికి తాగడానికి ప్రత్యేక కారణం అవసరమే లేదు.

Beer Diet: షాకింగ్ అంటే ఇదే.. బీరు మాత్రమే తాగాడు.. 46 రోజుల్లో 20 కేజీలు తగ్గాడు..!

Updated on: Mar 06, 2021 | 9:04 PM

Man Beer Diet: సంతోషం.. కోపం.. బాధ.. ఎమోషన్‌ ఏదైనా మందు తాగాల్సిందే. నిజానికి తాగడానికి ప్రత్యేక కారణం అవసరమే లేదు. అయితే ఎక్కువమంది మందుబాబులు బీర్ తాగాడానికి ఇష్టపడుతుంటారు. అయితే, బీర్ తాగితే అధికంగా బ‌రువు పెరుగుతార‌ని అంటుంటారు. నిజానికి అది అక్షర సత్యం. బీరు తాగితే పొట్టభాగంలో కొవ్వు చేరుతుందని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 46 రోజుల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా కేవ‌లం బీర్ మాత్రమే తాగాడు. ఇంకేముంది.. ఆ వ్యక్తి భారీగా బ‌రువు పెరిగి ఉంటాడు అనుకుంటున్నారా?.. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అత‌ను బ‌రువు పెర‌గ‌లేదు.. ఊహించని రీతిలో బరువు తగ్గాడు. బీరు తాగితే బరువు తగ్గడమేంటని అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.

అమెరికాలోని ఓహియోలో నివాసం ఉండే డెల్ హాల్‌కు వింత ఆలోచ‌న వ‌చ్చింది. అంద‌రూ ర‌క ర‌కాల డైట్‌ల‌ను పాటిస్తున్నారు క‌దా.. అలాగే తాను కూడా ఏదైనా స్పెషల్‌ డైట్‌ను పాటిస్తే బాగుంటుందని అనుకున్నాడు. అనుకున్నదే తడవు.. వినూత్నంగా బీర్ డైట్ ప్రారంభించాడు. 46 రోజుల పాటు కేవ‌లం బీర్ మాత్రమే తాగాడు. అది కూడా ఆక‌లి వేసిన‌ప్పుడు మాత్రమే. అయితే 46 రోజుల త‌రువాత షాకింగ్ రిజల్ట్స్ వచ్చింది. అదేంటంటే అతను 20 కేజీల‌కు పైగా బరువు తగ్గిపోయాడు. అలా అని బరువు తగ్గడానికి బాటిళ్ల కొద్ది బీరు తాగేయలేదు. ఇదిలాఉంటే.. మీరు మాత్రం ఇలాంటి బీర్‌ డైట్‌ను ఫాలో అవకండి. ఎందుకంటే ఇది ఎంతవరకు ఆరోగ్యకరమో తప్పనిసరిగా ఎవరికివారు ఆలోచించుకోవాలి.

Also read:

Dates benefits: ఖాళీ కడుపుతో కర్జురాలను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

Breaking news : నిలిచి ఉన్న కారులో ఒక్కసారిగా రేగిన మంటలు, సికింద్రాబాద్ అంజలి థియేటర్ దగ్గర కలకలం