
జీవితంలో ఎదగాలనే కోరిక ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆ ఎదుగుదలకు కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. కొందరు ఆర్థికంగా బాగుండడమే ఎదుగుదల అనుకుంటారు. మరికొందరు జ్ఞనాన్ని సంపాదించుకోవడమే ఎదుగుదల అనుకుంటారు. జీవితంలో నిజమైన ఎదుగుదల అంటే ఏంటో ఎందో గొప్ప తత్త్వవేత్తలు వేల ఏళ్ల క్రితమే చెప్పారు. అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు ఒకరు. విచక్షణ రహితంగా శత్రువులను సంహరించిన ఒక రాజు జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడన్నది ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం.
ఇక గౌతమ బుద్ధుడు అనగానే అందరికీ ప్రశాంతమైన ముఖం కళ్ల ముందు కదులుతూ ఉంటుంది. మనసు ఏమాత్రం కల్లోలానికి గురైనా, తెలియని ఏదో బాధ వెంటాడినా ఒక్కసారి బుద్ధుడు రూపాన్ని స్మరించుకుంటే ప్రశాంతత లభిస్తుంది. అందుకే మానసిక నిపుణులు సైతం ఇంట్లో గౌతమ బుద్ధుని ఫొటోను ఏర్పాటు చేసుకోమని చెబుతుంటారు. ఇక బుద్ధుడు చెప్పిన ప్రతీ మాట ఇప్పటికీ మన జీవితాలను నడిపించే ఒక పాఠంగా మారింది. మరి జీవితాన్ని మార్చే అలాంటి కొన్ని బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* ఏ పని చేసినా మనస్సాక్షిగా చేయాలని బుద్ధుడు చెప్పాడు. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనులు గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇక మనస్సాక్షిగా చేసినప్పుడు మనం చేస్తుంది తప్పో ఒప్పో మనకే అర్థమవుతోందని చెబుతారు.
* జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు ఎన్నడో తెలిపాడు. జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అన్న మాటకు చోటే ఉండదు. ఇక అంగీకరించడం, వదిలిపెట్టడం అనే దానిని అలవాటుగా మార్చుకోవాలని బుద్ధుడు సూక్తులు చెబుతున్నారు.
* బుద్ధుడి బోధనల్లో మరో ప్రధానమైన అంశం అందరి పట్ల సానుభూతి, దయతో ఉండడం. దయా, కరుణా ఉన్నవారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు తమను తాము ఇబ్బందులకు గురి చేసుకోరు.
* అహంకారం మనిషిని నాశనం చేస్తుందని బుద్ధుడు తెలిపాడు. అహాన్ని వదిలిన రోజే మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్లు చెబుతారు.
* ఇక భౌతిక సుఖాలపై అధిక వ్యామోహాలను విడిచి పెట్టిన రోజే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని బుద్ధుడు ఎన్నడో తెలిపారు. ఎలాంటి సుఖాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి తక్కువ సమస్యలను ఎదుర్కొంటాడు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..