Swarnim Vijay Varsh : ఆర్మీలో శౌర్య పురస్కారాలు పొందిన వారికి సాయాన్ని పది రెట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం

Gallantry awards : అర్మీలో శౌర్య పురస్కారాలు పొందిన వారికి సాయాన్ని పది రెట్లు పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు..

Swarnim Vijay Varsh : ఆర్మీలో శౌర్య  పురస్కారాలు పొందిన వారికి సాయాన్ని పది రెట్లు పెంచిన ఏపీ ప్రభుత్వం
Follow us

|

Updated on: Feb 19, 2021 | 7:22 AM

Gallantry awards : ఆర్మీలో శౌర్య పురస్కారాలు పొందిన వారికి సాయాన్ని పది రెట్లు పెంచింది ఏపీ ప్రభుత్వం. స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ కార్యక్రమ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు సీఎం జగన్‌. పరమవీర చక్ర, అశోక్‌ చక్ర అవార్డులు పొందిన వారి కుటుంబాలకు ఇకపై కోటి రూపాయలు ఇస్తామన్నారు. తిరుపతిలో జరిగిన స్వర్నిమ్‌ విజయ్ వర్ష్‌లో పాల్గొన్న ఏపీ సీఎం జగన్‌.. ఆ యుద్ధంలో విశేష సేవలందించిన రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ సి.వేణుగోపాల్‌ను సత్కరించారు. ఆయన ఇంటికి వెళ్లి మాట్లాడారు.

భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. గతేడాది డిసెంబర్ 16న ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకం దగ్గర వెలిగించిన విజయ జ్వాల తిరుపతి చేరుకుంది. రేపటి వరకు ఈ జ్వాల అక్కడే ఉంటుంది.  ఈ జ్వాలను పరేడ్‌ గ్రౌండ్స్‌ వేదిక మీదకు తీసుకొచ్చారు సీఎం జగన్‌. ఆ తర్వాత సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ… స్వర్నిమ్‌ విజయ్‌ వర్ష్‌ ప్రత్యేకతను వివరించారు.

ఈ సందర్భంగా ఆర్మీలో పని చేసే వారి సేవలకు కేంద్రం ఇచ్చే అవార్డులకు రాష్ట్రం తరపున ఇచ్చే సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. పరమవీర, అశోక్‌ చక్ర అవార్డులు పొందిన వారి కుటుంబాలకు ఇకపై కోటి రూపాయలు ఇస్తామన్నారు. భారత సైన్యం.. ఎండ, చలి, వర్షాన్ని లెక్కచేయక సేవలు అందిస్తోందని ప్రశంసించారు. బంగ్లాదేశ్‌ ఏర్పాటు మన సైన్యం గొప్పతనమని గుర్తుచేశారు. సైనికుల త్యాగాలు మరువలేనివన్న సీఎం.. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న వారి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు.

Read also : న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు దారితీసిన పరిస్థితులు.? కుంటశ్రీనుకు ముడిపడిన అంశాలు.!

Latest Articles