వర్షాకాలంలో కరెంట్‌తో జర భద్రం.. షాక్‌ తగిలితే వెంటనే ఏం చేయాలి..తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

|

Jul 01, 2023 | 7:31 PM

ఆ వ్యక్తి శ్వాస తీసుకోకపోతే వెంటనే CPR చేయాలి. కాలిన గాయం ఎక్కువగా ఉంటే దుప్పటి, టవల్‌ వంటివి ఉపయోగించవద్దు. ఎందుకంటే అది కాలిన చర్మానికి అంటుకునే అవకాశం ఉంది. వీలైనంత వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి.

వర్షాకాలంలో కరెంట్‌తో జర భద్రం.. షాక్‌ తగిలితే వెంటనే ఏం చేయాలి..తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
Electric Shock
Follow us on

వర్షాకాలంలో ఎక్కడికక్కడ వాననీరు చేరడం, బలమైన గాలులకు వైర్లు తెగిపోవడం, గోడలు తడిసిపోవడంతో స్విచ్‌ బోర్డులు కూడా షాక్‌ కొడుతుంటాయి. అటువంటి పరిస్థితిలో విద్యుత్ షాక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుదాఘాతం శరీరానికి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది. రక్తం మండడం, ఒళ్లు కాలిపోవడం, కండరాల నొప్పులు, రక్తం గడ్డకట్టడం, శరీర భాగాల క్షీణత, గుండెపోటు, శ్వాస ఆడకపోవటంతో సృహకోల్పోవటం, శరీంలో తీవ్రమైన డీహైడ్రేషన్‌ కలుగుతుంది. విద్యుదాఘాతంతో మరణానికి ప్రధాన కారణం గుండె పనిచేయకపోవటం. తీవ్రమైన కరెంట్‌ షాక్‌ వల్ల గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. లేదా రక్తం అక్కడ ఆగదు. దీనిని కర్ణిక, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటారు.. దీని కారణంగా చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. లేదంటే బాధితుడు కోమాలోకి వెళ్లవచ్చు. శ్వాసక్రియను కార్డియోపల్మోనరీ అరెస్ట్ అని కూడా అంటారు.

కరెంట్‌ షాక్‌ ప్రమాదాలకు ప్రధాన కారణాలు..

– ఇంటి గోడలు తడిగా ఉండటం కారణంగా స్విచ్ బోర్డులో విద్యుత్ ప్రవాహం ఉంటుంది.

– ఇంట్లో ఎర్తింగ్‌ వేయకపోతే షాక్‌ తగులుతుంది.

ఇవి కూడా చదవండి

– తడి చేతులతో విద్యుత్ తీగలు. ఉపకరణాలను తాకడం.

– ప్లగ్ లేదా స్విచ్ బోర్డులో నీరు ఉంటే షాక్ కొడుతుంది.

– విద్యుత్ స్తంభాల చుట్టూ వరదలు పొంగిపొర్లుతుంటే కరెంట్‌ కొట్టే ప్రమాదం ఉంది.

– విద్యుత్ స్తంభం వైర్లు తగిపోయిన సమయంలో కూడా షాక్‌ తగిలే ప్రమాదం ఉంది.

– ఇంటి రెయిలింగ్ దగ్గర ఏదైనా విద్యుత్ తీగ తగిలితే విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

విద్యుత్ షాక్‌లను నివారించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి ..

– వర్షాకాలానికి ముందు ఇంట్లో ఉన్న అన్ని స్విచ్ బోర్డులు, వైర్లను పరీక్షించండి. ఎక్కడైన వైర్ తెరిచి ఉంటే వెంటనే దాన్ని మూసివేయండి.

– పొడి బట్టలు ధరించండి. మీ చేతులను ఎల్లప్పుడూ పొడిగా ఉంచండి. పొడి బూట్లు, చెప్పులు ధరించండి.

– విద్యుత్‌ మీటర్ నుండి ఇంటికి వచ్చే కేబుల్‌ను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోండి.

– ఇంట్లో ఎర్తింగ్ సమస్య ఉంటే వెంటనే పరిష్కరించండి.

– విద్యుత్‌ వైర్ల కింద ఇళ్లను నిర్మించరాదు. వైర్ల కింద చెట్లను నాటకూడదు.

– విద్యుత్ లైన్ల దగ్గర బట్టలు ఆరబెట్టడానికి ఇనుప తీగలు కట్టవద్దు.

– ISI మార్క్ వైర్, ఇతర ఉత్పత్తులతో హౌస్ వైరింగ్ చేయండి.

– అగ్నిప్రమాదం జరిగితే వెంటనే మెయిన్స్ ఆఫ్ చేయండి.

– విద్యుత్‌ ప్రవాహానికి మంటలు అంటుకున్నట్లయితే దానిపై నీళ్లు చల్లే ప్రయత్నం చేయరాదు..

– పర్మిట్ ఉద్యోగి ద్వారా మాత్రమే ఎలక్ట్రికల్ పనులను చేయించండి.

– ఎవరికైనా కరెంటు షాక్ తగిలితే వారిని తాకవద్దు, కర్ర సహాయంతో వారిని కరెంటుకు దూరంగా జరపండి.

– ఒట్టి చేతులతో, చెప్పులు లేకుండా పవర్ టూల్స్ ఉపయోగించవద్దు.

విద్యుదాఘాతానికి ప్రథమ చికిత్స ఎలా అందించాలి?

ఒక వ్యక్తి షాక్‌కు గురైతే, వారిని ఒట్టి చేతులతో తాకవద్దు, ఎలక్ట్రికల్ పరికరాలను తాకవద్దు. స్విచ్‌బోర్డ్‌లను ఒట్టి చేతులతో తాకవద్దు, ఇలా చేస్తే మీకు కూడా షాక్‌ తగులుతుంది.

విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి ఉంగరాలు, నెక్లెస్‌లు, బూట్లు, సాక్స్, బెల్టులు వంటివి ధరించి ఉన్నట్టయితే.. వెంటనే వాటిని తొలగించండి. అప్పుడు వ్యక్తిని నేలపై పడుకోబెట్టండి. అతని కాళ్ళను ఆడించండి. అతని తలను కూడా కాస్త పైకి ఎత్తి ఉంచాలి.

ఆ వ్యక్తి శ్వాస తీసుకోకపోతే వెంటనే CPR చేయాలి.

కాలిన గాయం ఎక్కువగా ఉంటే దుప్పటి, టవల్‌ వంటివి ఉపయోగించవద్దు. ఎందుకంటే అది కాలిన చర్మానికి అంటుకునే అవకాశం ఉంది. వీలైనంత వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి…