Lightning strike: పిడుగులు ఎందుకు పడతాయి? అప్పుడు ఏం చేయాలి..?

పిడుగుపాటు కారణంగా ఏటా దేశంలో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి ఈ పిడుగులు ఎలా ఏర్పడతాయి? ఉష్ణోగ్రతల వల్ల మేఘాలు ఛార్జ్‌ అయ్యి విద్యుత్ ప్రవాహంగా భూమిపైకి దూసుకొస్తాయి. పిడుగులు పడేటప్పుడు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడం, చెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించడం అత్యవసరం.

Lightning strike: పిడుగులు ఎందుకు పడతాయి? అప్పుడు ఏం చేయాలి..?
Lightning Strike

Updated on: May 23, 2026 | 12:12 PM

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ సమయంలో పిడుగులు పడటం వల్ల ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే పిడుగులు ఎలా ఏర్పడతాయి..? వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి..? అనే విషయాలపై అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చెరువులు, నదులు, భూమిపై ఉన్న నీరు ఆవిరై ఆకాశంలోకి వెళ్తుంది. ఇలా ఏర్పడిన మేఘాల్లో విద్యుత్ శక్తి చేరుతుంది. మేఘాల పైభాగంలో ధనావేశం, కింద భాగంలో రుణావేశం ఏర్పడతాయి. ఈ సమయంలో మేఘాల్లోని విద్యుత్ శక్తి భూమిపై ఉన్న చెట్లు, భవనాలు, టవర్లు, మనుషులు వంటి వాటి వైపు ఒక్కసారిగా దూసుకురావడం జరుగుతుంది. దీన్నే పిడుగు అంటారు. పిడుగు పడే సమయంలో భారీ శబ్దంతో ఉరుములు, వెలుగులతో మెరుపులు కనిపిస్తాయి.

పిడుగులు పడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పొలాల్లో పని చేస్తున్న రైతులు వెంటనే ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. చెట్ల కింద, సెల్ టవర్ల దగ్గర నిలబడకూడదు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించడం మంచిది. నీళ్లలో ఉన్నవారు వెంటనే బయటకు రావాలి. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండకూడదు.

బయట ఎక్కడైనా చిక్కుకుపోతే నేలపై పూర్తిగా పడుకోకుండా, మునివేళ్లపై కూర్చుని తలను వంచుకోవడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. కారులో ఉన్నవారు బయటకు రావకుండా కారులోనే ఉండటం మంచిది. ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే పిడుగుల ప్రమాదం నుంచి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

3 బాణాలతో మహాభారత యుద్ధాన్ని ముగించే శక్తి ఉన్న బార్బరీకుడు గురించి మీకు తెలుసా..? 

Loading...
Unable to load recommendations.
Follow Us