Beer: ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్ ఇదే.. ఒక్కసారి తాగితే చాలు.. డే అంతా.. అలా.. అలా..

World's Strongest Beer: ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్ ఎంత ప్రమాదకరమో.. దీన్ని తయారు చేసే కంపెనీ ఈ బీర్‌ను ఒకేసారి 35 ఎంఎల్ కంటే ఎక్కువ తాగవద్దని బాటిల్‌పై రాసి వార్నింగ్ రాసి పెడుతుంది. కారణం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. అదేంటో ఇప్పుడు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Beer: ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగ్ బీర్ ఇదే.. ఒక్కసారి తాగితే చాలు.. డే అంతా.. అలా.. అలా..
World's Strongest Beer

Updated on: Jun 19, 2023 | 9:11 PM

Beer Facts: ప్రపంచంలో లిక్కర్ తాగేవారి జాబితాలో ఇండియన్స్ తొలి ఐదవ స్థానంలో ఉన్నారన్నది నిజం. ప్రతి కుటుంబంలో మద్యం,  బీర్ తాగేవారిని చూడవచ్చు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఇది కామన్‌గా మారిపోయింది. అయితే వీరిలో చాలా మంది దీనిని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే తాగుతారు. ఈ సమయంలో బెస్ట్  వైన్ లేదా బీర్ త్రాగడానికి ఇష్టపడుతారు. అయితే, ఎవరు కూడా మనం ఇప్పుడు చెప్పు కోనున్న బీరును మాత్రం అస్సలు తాగలేరు. ఇందుకు కారణం ఉంది. ఎందుకంటే ఇంది ప్రపంచంలోని అత్యంత స్టాంగ్ బీర్ ఇది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎంత స్టాంగ్‌గా ఉంటుందో అంతగా మనపై ప్రభావం చూపిస్తంది. ప్రపంచంలోనే అత్యంత స్టాంగెస్ట్ బీరు పేరు స్నేక్ వెనమ్. ఈ బీరును తయారు చేస్తున్నది బ్రేవ్ మాస్టర్ కంపెనీ. ఈ బీర్‌లోని ఆల్కహాల్ శాతం కూడా అదే తరహాలో ఉంటుంది. ఇందులో కంటెంట్ 67.5 శాతం వరకు ఉంటుంది. మనం మన వైన్ షాపులో దొరికే సాధారణ బీరు ఇది చాలా రేట్లు ఎక్కువ.

చాలా దేశాల్లో బీర్‌లోని ఆల్కహాల్ కంటెంట్‌పై పరిధి ఉంటుంది. ఎక్కువగా ఉండటం చట్టం అస్సలు ఒప్పు కోదు. ఇది బ్రిటిష్ బీర్.. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా ఫేమస్ అని చెప్పాలి. అయితే చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని తాగేందుకు సాహసం చేస్తుంటారు. ఈ బీర్‌ను తయారు రెడీ చేసేందుకు స్మోక్డ్ పీట్ మాల్ట్, షాంపైన్ ఈస్ట్‌తో పాటు బార్లీ వైన్ ఈస్ట్‌ను ఉపయోగిస్తారు.. 330ml బీర్ కాస్ట్ దాదాపు 40 పౌండ్లు ఉంటుంది. అంటే మన రూపాయల్లో చూస్తే సుమారు  రూ. 4 వేల కంటే ఎక్కువ అని చెప్పు కోవాలి.

తాగిన తర్వాత ఏమవుతుంది?

మీరు ఇంతకు ముందెన్నడూ తాగి ఉండకపోతే, మొదటిసారిగా తాగితే, హాస్పిటల్ దగ్గర ఉండేందుకు ప్రయత్నించండి అని తాగేవాళ్లు చెబుతున్నారు. ఈ బీర్ తాగిన తర్వాత చాలాసార్లు తల తిరిగినట్లుగా అవడం.. తాగింది వాంతులు చేసుకోవడం చేస్తుంటారు తాగినవారు. కొంత సమయం తర్వాత స్పృహ పూర్తిగా కోల్పోతారు. వేగంగా మత్తులోకి జారుకుంటారు. అంతేకాదు మాట్లాడుతున్నప్పుడు నాలుక కూడా తడబడటం మొదలువుతంది. ఈ బీర్ తాగిన తరువాత, మీ శరీరం స్పర్శను కోల్పోతుంది.. మత్తుగా మారిపోతుంది. తాగిన తర్వాత ఎటైన కదిలేందుకు కూడా మీ మెదడు సహకరించదు. అప్పుడు మీరు అక్కడ నుండి లేవడం చాల ఇబ్బందిగా మారుతుంది. ఈ బీర్ హ్యాంగోవర్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఈ బీరు తాగిన తర్వాత అంటే రెండో రోజు ఉదయం మొత్తు నుంచి బయట పడిన తర్వాత విపరీతమైన తలనొప్పి మొదలువుతుంది.  ఏం చేయాలో కూడా అర్థం కాదని తాగేవాళ్లు సూచిస్తుంటారు.

బీర్ బాటిల్ గోధుమ రంగులో ఎందుకు ఉంటుంది?

ప్రపంచంలోనే అత్యంత మత్తునిచ్చే ఈ బీర్ బాటిల్ కూడా బ్రౌన్ కలర్‌లోనే ఉంటుంది. గోధుమ రంగు సీసాల్లోనే బీరు నింపుతారు. దీనికి ఓ బలమైన కారణం ఉంది. ఎందుకంటే సూర్యరశ్మీ బ్రౌన్ కలర్ బాటిళ్లలో ఉన్న బీరుపై పెద్దగా  ప్రభావం చూపదు. బీర్ త్వరగా చెడిపోవడానికి అవకాశం లేదు. హోమియోపతికి సంబంధించిన చాలా మందులు బ్రౌన్ వైల్స్‌లో మాత్రమే వస్తాయి.. దీనికి కూడా అదే కారణం. ఎందుకంటే ఇది సూర్య కిరణాలతో రియాక్షన్ కాదు.. అందుకే బీరు, మందులు, బ్రౌన్ కలర్ సీసాలో నిల్వ చేస్తారు.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం