
పశ్చిమసియా ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ముడి చమురు ధరలు ఇలాగే కొనసాగితే రాబోయే 3 నుంచి 4 నెలల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని కారణంగా దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని సూచిస్తన్నారు. అయితే ఇప్పుడంటే మనకు గల్లీకో పెట్రోల్ బంక్ ఉంది. దీంతో పెద్దగా ఇందన కొరతే లేదు. కానీ వన్నీ లేకుముందు మన దేశంలో రవాణా వ్యవస్థ ఎలా నడిచింది. అసలు మన దేశంలో ఫస్ట్ పెట్రోల్ బంక్ ఎప్పుడు, ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు తెలుసా. అప్పట్లో లీటర్ పెట్రోల్ ఎంత ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా?
నివేదికల ప్రకారం.. నిజానికి, మన దేశంలో మొట్టమొదటి పెట్రోల్ పంపు 1928లో స్టార్ట్ అయింది. అప్పుడు మన దేశాన్ని బ్రిటీషర్స్ పాలించేవారు. అప్పుడు కూడా మన దేశానికి ముంబై ఆర్ధిక రాజధానిగా ఉండేది. దీంతో దేశంలో ఇందన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన హ్యూస్ రోడ్ ఎంచుకున్నారు. ఇక్కడే దేశంలోని తొలి పెట్రోల్ బంక్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎంతో పేరున్న ప్రముఖ అంతర్జాతీయ చమురు సంస్థ అయిన బర్మా షెల్ ఈ ప్రెట్రోల్ బంక్‌ను స్టార్ట్ చేసింది. ఆ రోజుల్లో దీన్ని ఓ అద్భుతమైన సాంకేతిక విజయంగా భావించారు.
కానీ ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకులతో పోల్చుకుంటే అప్పట్లో ఉన్న బంకులు చాలా సాధారణంగా ఉండేవి. అప్పుడు ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవి లేవు. కేవలం సిబ్బంది చేతులతో మాత్రమే తిప్పుతూ ఇందనాన్ని పోసేవారు. అయినా అప్పట్లో భూగర్భంలో పెట్రోల్ నిల్వలు కూడా అంతలా ఉండేవి కాదు. ఇప్పుడంటే మం సొంతంగా భూమిని చమురు తీసి పెట్రోల్, డీజిల్ తయారు చేస్తున్నాం కానీ.. అప్పట్లో మన దగ్గర ఈ టెక్నాలజీ లేదు. ఇందనం కోసం బర్మా, ఇరాన్, పశ్చిమ ఆసియా వంటి దేశాలపై ఆదారపడేవారు. విదేశాల నుంచి పోర్ట్‌లకు వచ్చే ఇందనాన్ని ఇనుప బ్యారెట్స్ నింపి అక్కడి నుంచి ఎద్దుల బండ్ల ద్వారా పెట్రోల్ బంకుల్లోకి తెచ్చేవారు. అలా తెచ్చిన వాటిని చేతితో నడిచే పంపుద్వారా వాహనాల్లో పోసేవారు.
రూపాయికి 16 లీటర్ల పెట్రోల్..!
ఇప్పుడంటే మన దగ్గర పెట్రోల్ ధరలు రూ.110 ఉంది కాని.. అప్పట్లో అంటే పెట్రోల్ బంక్ స్టార్ట్ చేసిన కొత్తలో మన దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.1 నుంచి 2 అణాలు మాత్రమే ఉండేదట. ప్రస్తుత లెక్కల ప్రకారం 6 నుండి 12 పైసలు. అంటే అప్పట్లో ఒక రూపాయికి దాదాపు 16 లీటర్ల కంటే ఎక్కువ పెట్రోలే వచ్చేదన్నాట. కానీ అప్పుడు ఆ డబ్బుల సంపాదన కూడా అలానే ఉండేది. అప్పట్లో ఒక వ్యక్తి రోజువారి ఆదాయం రూపాయి కూడా ఉండేది కాదట. కాబట్టి అప్పట్లో కూడా పెట్రోల్ ఖరీదైనదిగానే ఉంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.